27.7 C
Hyderabad
May 7, 2024 07: 35 AM
Slider ఖమ్మం

మొక్కలతోనే మానవ మనుగడ

#Gautham

మొక్కల తోనే మానవ మనుగడ అని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. పద్మశ్రీ వనజీవి రామయ్య, జిల్లా కలెక్టర్ ను ఐడిఓసి లోని కలెక్టర్ ఛాంబర్ లో కలిసి, సుమారు 20 కిలోల వేప విత్తనాలను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, వేప చెట్ల ఆవశ్యకత ఎంతో ఉందని, ఆయుర్వేదంలో వేప ఎంతో ఉపయోగమని అన్నారు.

పద్మశ్రీ వనజీవి రామయ్య తన పెన్షన్ పెంపు, గృహాలక్ష్మి పథక లబ్ది, మోపెడ్ ఇప్పించగలందులకు కలెక్టర్ ను కోరగా, కలెక్టర్ సానుకూలంగా స్పందించి, సంబంధిత అధికారులకు పరిశీలించి, తగుచర్యలకై ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ స్నేహాలత మొగిలి, శిక్షణా సహాయ కలెక్టర్ రాధిక గుప్తా, డీఆర్డీఓ విద్యాచందన తదితరులు పాల్గొన్నారు.

Related posts

అర్హులందరికి ఆసరా పెన్షన్ అందించేందుకు సిద్ధం

Satyam NEWS

సిరిసిల్లా జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

Satyam NEWS

మేడే వేడుకలను జయప్రదం చేయండి: సి ఐ టి యు

Satyam NEWS

Leave a Comment