26.7 C
Hyderabad
May 21, 2024 06: 47 AM
Slider ఖమ్మం

వచ్చే ఎన్నికలు పారదర్శంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు

#Collector V.P

రాబోయే అసెంబ్లీ ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకు పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. ఐడిఓసి లోని కాన్ఫరెన్స్ హాల్లో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా, పోలింగ్ కేంద్రాల వంటి అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన పై రాజాకీయ పార్టీల ప్రతినిధులు వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, రాబోయే ఎన్నికలను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. సమగ్ర ఓటరు జాబితాను ఈ నెల 21 అన్ని పోలింగ్ కేంద్రాలలో ప్రదర్శించడం జరుగుతుందని తెలిపారు.

1350 కంటే ఎక్కువ ఓటర్ల సంఖ్య వున్నా పోలింగ్ కేంద్రం పరిధిలో అదనంగా మరో పోలింగ్ కేంద్రాన్ని కేటాయించడం జరిగిందని, మొత్తం జిల్లాలో 16 నూతన పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందని అన్నారు. అదేవిధంగా 65 పోలింగ్ కేంద్రాలను మరో చోటుకు మార్చడం, 36 పోలింగ్ కేంద్రాల పేరు మార్పుకు ప్రతిపాదనలు చేశామన్నారు.

ఓటర్లు వారి పోలింగ్ కేంద్రాన్ని జాబితాలో సరిచుకోవాలని తెలిపారు. జిల్లాలో 1439 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని, అందులో ఖమ్మం నియోజక వర్గంలో 341, పాలేరు నియోజక వర్గంలో 289, మధిర నియోజకవర్గంలో 268, వైరా నియోజకవర్గంలో 252, సత్తుపల్లి నియోజకవర్గంలో 289 ఉన్నాయని తెలిపారు.

బూత్ లెవెల్ ఏజెంట్ల జాబితాను సమర్పించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులకు సూచించారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ప్రక్రియను పూర్తీ చేసేందుకు అన్ని పార్టీల ప్రతినిధులు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు అభిలాష అభినవ్, మధుసూదన్ నాయక్, ఖమ్మం మునిసిపల్ కమీషనర్ ఆదర్శ్ సురభి, కల్లూరు ఆర్డీవో అశోక్ చక్రవర్తి, ఎస్డీసి రాజేశ్వరి, ఖమ్మం అర్బన్, రూరల్ తహశీల్దార్లు శైలజ, రామకృష్ణ, కలెక్టరేట్ ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ రాంబాబు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి పసుమర్తి శ్రీనివాస్, బిఎస్పి పార్టీ ప్రతినిధి మిరియాల నాగరాజు, బిజెపి పార్టీ ప్రతినిధి జిఎస్ఆర్ఏ.

విద్యాసాగర్, సిపిఐ(యం) పార్టీ ప్రతినిధి సత్యనారాయణ, సిపిఐ పార్టీ ప్రతినిధి సింగు నర్సింహారావు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి సలీం, బిఆర్ఎస్ పార్టీ ప్రతినిధి చింతనిప్పు కృష్ణ చైతన్య, టిడిపి పార్టీ ప్రతినిది కృష్ణ ప్రసాద్, అధికారులు, తదితరులు పాల్గొన్నారు

Related posts

ములుగు జిల్లా అభివృద్ధి కమిటీ ఎన్నిక

Satyam NEWS

రాజకీయ కల్లోలంతో అధ:పాతాళానికి పాక్ ఆర్ధిక వ్యవస్థ

Satyam NEWS

అడ్డంకులు ఎదురైనా అధిగమించి ముందు సాగాలి

Bhavani

Leave a Comment