29.7 C
Hyderabad
May 7, 2024 05: 17 AM
Slider ప్రపంచం

రాజకీయ కల్లోలంతో అధ:పాతాళానికి పాక్ ఆర్ధిక వ్యవస్థ

#pakistan

పాకిస్తాన్ లో జరుగుతున్న రాజకీయ తిరుగుబాటుతో ఆ దేశం ఆర్ధికంగా తీవ్ర వత్తిడికి లోనవుతున్నది. ఇప్పటికే ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగింది. దాంతో పాకిస్తాన్ కరెన్సీ విలువ భారీగా తగ్గిపోయింది. క్షీణిస్తున్న విదేశీ నిల్వల కారణంగా బడ్జెట్ లోటు తీవ్రమౌతున్నది.

కొనసాగుతున్న రాజకీయ గందరగోళం కారణంగా ఇప్పటికే పాక్ కరెన్సీ అధ:పాతాళానికి చేరిందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక ఎత్తి చూపింది. అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్‌ నివేదిక ప్రకారం ఈ ఏడాది దేశంలోని డాలర్ బాండ్లు ఇప్పటికే 5 శాతం క్షీణించాయి.

అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF)తో అంగీకరించిన సంస్కరణలను అమలు చేయడం ప్రస్తుతం సాధ్యం కానందున పాకిస్తాన్‌కు ఇచ్చిన 6 బిలియన్ డాలర్ల బెయిలౌట్ ప్యాకేజీని నిలిపివేయడానికి IMF సిద్ధం అవుతున్నది. ఇదే జరిగితే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ మరింత క్షీణిస్తుంది. రాజకీయ పోరాటం కారణంగా కరెంట్-ఖాతా లోటుపై అధికారులు దృష్టి పెట్టలేకపోతున్నారు. దీనివల్ల పెట్టుబడిదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.

Related posts

ఘనంగా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా పుట్టిన రోజు

Satyam NEWS

ఉత్తరాంధ్ర కల్పవల్లి పండుగ బందోబస్తు పై డీఐజీ ప్రత్యేక దృష్టి

Satyam NEWS

రూ.60 లక్షలతో దివ్యాంగులకు ట్రై సైకిళ్ల పంపిణీ

Satyam NEWS

Leave a Comment