32.2 C
Hyderabad
May 21, 2024 12: 37 PM
Slider నిజామాబాద్

వెలకట్టలేని సేవలు అందిస్తున్న వైద్యులు పోలీసులు

Vemula 211

కరోనా వైరస్  నివారణ కోసం పనిచేస్తున్న వివిధ విభాగాల వారి సేవలు వెల కట్టలేనివని రాష్ట్ర రోడ్లు  భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. మంగళవారం నాడు నిజామాబాద్ జిల్లా వేల్పూర్ సొసైటీ దగ్గర బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  సరుకుల పంపిణీ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ విపత్తు కాలంలో కష్టపడి  పనిచేస్తూ ప్రజల్ని కరోనా వైరస్ బారిన పడకుండా పని చేస్తున్న హెల్త్ డిపార్ట్మెంట్, రెవెన్యూ, పోలీస్, అంగన్వాడీ, మీడియాను అభినందించారు. గత 27 రోజుల నుంచి తెలంగాణ రాష్ట్రంలో లాక్ డౌన్  పాటిస్తున్నామని,  ఈ శాఖల సిబ్బంది  అధికారులు తమ కుటుంబాన్ని వదిలేసి కరోనా వైరస్ కట్టడి  డి కోసం  బ్రహ్మాండంగా పనిచేస్తున్నారని,  వారి సేవలు వెలకట్టలేనివని అభినందించారు. 

సీఎం గిఫ్ట్ గా  పారిశుద్ధ్య కార్మికులకు, హెల్త్ సిబ్బందికి, డాక్టర్లకు, నర్సులకు, పోలీసులకు పది శాతం అదనపు వేతనం ప్రకటించామని మంత్రి గుర్తు చేశారు. నియోజకవర్గంలో నాలుగు శాఖలలోని వారికి  మొత్తం  1219 మంది కీ 10 కిలోల బియ్యం, కేజీ పెసరపప్పు, కేజీ కంది పప్పు, కేజీ నూనె, కేజీ చక్కర కేజీ పిండి బిల్డర్స్ అసోసియేషన్ సభ్యులు పంపిణీ చేస్తున్నారని, వీటి విలువ దాదాపు 11 లక్షల రూపాయల మేరకు ఉంటుందని మంత్రి తెలిపారు.

అంతకుముందు వేల్పూర్ ఎక్స్ రోడ్ వద్ద  ఎమ్మెల్సీ డి రాజేశ్వరరావు తో కలిసి 600 మంది క్రైస్తవులకు నిత్యవసర వస్తువులను పంపిణీ చేయడానికి బయల్దేరే వాహనాలను మంత్రి జెండా ఊపి  ప్రారంభించారు. ఈ కార్యక్రమాలలో అదనపు కలెక్టర్  చంద్రశేఖర్,  ఆర్డీవో శ్రీనివాస్ , క్రిస్టియన్ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కే ఆనంద్ పాల్ ఇతర సభ్యులు  బిల్డర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కార్యవర్గ సభ్యులు నరసింహారావు ఎస్ ఎన్ రెడ్డి డి వి ఎన్ రెడ్డి భాస్కర్ రెడ్డి సంతోష్ రెడ్డి సురేందర్ రెడ్డి ఎంపీపీ జమున జెడ్పిటిసి భారతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలుగు భాషను కాపాడుకోవడం మన బాధ్యత

Satyam NEWS

క‌రోనా మహమ్మారి కాలంలో నిశ్బబ్ద భాదితులు దివ్యాంగులే

Sub Editor

ఇది మంత్రుల కార్యక్రమమా? టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా?

Satyam NEWS

Leave a Comment