28.2 C
Hyderabad
May 17, 2024 12: 23 PM
Slider జాతీయం

రాపిడ్ టెస్టింగ్ కిట్లను రెండు రోజులు వాడవద్దు

gangakhedkar

రాపిడ్ టెస్టింగ్ కిట్లను రెండు రోజుల పాటు వాడవద్దని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసీఎంఆర్) రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. రాబోయే రెండు రోజుల్లో రాపిడ్ టెస్టింగ్ కిట్లకు సంబంధించిన విషయంలో తాము గైడ్ లైన్స్ విడుదల చేస్తామని ఐసీఎంఆర్ శాస్త్రవేత్త ఆర్ గంగాఖేడ్కర్ కోరారు.

వివిధ రాష్ట్రాలు ఇప్పటికే రాపిడ్ టెస్టింగ్ కిట్స్ తెప్పించుకున్నాయి. వాటితో పరీక్షలు చేస్తున్నాయి. అయితే ఈ రాపిడ్ టెస్టింగ్ కిట్స్ ఫలితాల విషయంలో వివాదాలు నెలకొంటున్నాయి. ఈ మేరకు ఐసీఎంఆర్ కు వివిధ రాష్ట్రాల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో ఐసీఎంఆర్ రెండు రోజుల పాటు రాపిడ్ టెస్టింగ్ కిట్స్ తో పరీక్షలు నిలిపివేయాలని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు ప్రభుత్వాలు అతి ఎక్కువ రేటుకు ఇటీవలే లక్షలాది కిట్లు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే.

Related posts

దేశంలో దాడులకు ఉగ్రవాదుల భారీ ప్లానింగ్‌

Sub Editor

మోదీ పర్యటనకు కేసీఆర్‌కు కేంద్రం ఆహ్వానం

Bhavani

మంచినీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపండి

Satyam NEWS

Leave a Comment