37.2 C
Hyderabad
April 30, 2024 12: 33 PM
Slider కరీంనగర్

కరోనా హెల్ప్: దత్తత గ్రామంలో నిత్యావసరాలు పంచిన సీపీ

Ramagundam CP

సీఎం కేసీయార్ ఆదేశాలు, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్ సూచనల మేరకు లాక్ డౌన్ ముగిసే వరకు ఆదివాసీ కొలంగుడ గ్రామాన్ని రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ దత్తత తీసుకున్నారు. హాజిపూర్ మండలం కొలాంగూడ  గ్రామంలో పోలీసుల ఆధ్వర్యంలో 38 ఆదివాసీ కొలాం కుటుంబాలకు ఆయన నేడు బట్టలు,నిత్యావసర వస్తువులు పంపిణి చేశారు.

ఈ కార్యక్రమంలో సిపి సత్యనారాయణ తోబాటు డీసీపీ ఉదయ్ కుమార్ రెడ్డి,ఎసిపి లక్ష్మి నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ కొలం గూడ గ్రామాన్ని దత్తత తీసుకుని,లాక్ డౌన్ ముగిసే వరకు ఇక్కడి ఆదివాసీలకు నిత్యావసరాలు,బట్టలు, వైద్యం తో సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనరెట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో 3 కరోనా కేసులు నమోదు అయినా సెకండరీ కాంటాక్ట్ ద్వారా ఎవ్వరికీ పాజిటివ్ కేసులు నమోదు కాలేదని ఆయన తెలిపారు. తమ పరిధి ఇప్పటికీ సేఫ్ జోన్ లో ఉన్నదని ఆయన అన్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లో లాక్ డౌన్ ను ఉల్లంఘించి రోడ్ల పైకి వచ్చిన 8000 వేల వాహనాలు సీజ్ చేసి, 800 కేసులు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

Related posts

కరోనా నుంచి ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసమే లాక్ డౌన్

Satyam NEWS

ప్రభుత్వ పాఠశాలలో ప్లాస్టిక్ బియ్యం పంపిణి..?

Satyam NEWS

ఓ విఘ్నరాజా…

Satyam NEWS

Leave a Comment