29.7 C
Hyderabad
May 3, 2024 06: 16 AM
Slider మహబూబ్ నగర్

ఇది మంత్రుల కార్యక్రమమా? టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమమా?

#MinisterNiranjanReddy

అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర మంత్రుల కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ జెండాలు ఏర్పాటు చేయడం పై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి.

వనపర్తిలో నేడు తెలంగాణ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

వనపర్తి సమీపంలోని అప్పాయిపల్లి లో మంత్రులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాగర్ కర్నూల్ ఎం. పి. పోతుగంటి రాములు, జిల్లా పరిషత్ చైర్మన్ ఆర్.లోకేనాథ్ రెడ్డి,

జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్ష్యుడు  లక్ష్మయ్య, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, మాజీ మునిసిపల్ చైర్మన్ పలుస రమేష్ గౌడ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్,

ఎంపిపి కీచారెడ్డి కౌన్సిలర్లు పాల్గొన్నారు. అదే విధంగా పీర్ల గుట్టలో డబుల్ ఇండ్ల నిర్మాణానికి మంత్రులు శంకుస్థాపన చేశారు.

పానుగల్, కొల్లాపూర్ రహదారి పనులను కూడా మంత్రులు నేడు ప్రారంభం చేశారు. మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ మంత్రులను సన్మానం చేశారు.

కాగా వనపర్తిలో మంత్రులు పాల్గొన్న కార్యక్రమాల్లో టిఆర్ఎస్ జెండాలు ఏర్పాటు చేసినందుకు బిజెపి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

మంత్రుల కార్యక్రమాలకు బి.జె.పి  కౌన్సిలర్లు రమాదేవి, పద్మ పరుశరాం హాజరు కాలేదని బిజెపి నేత,మునిసిపల్ మాజీ వైస్ ఛైర్మన్ బి.కృష్ణ విలేకరుల సమావేశంలో చెప్పారు.

వనపర్తిలో నేడు జరిగిన ప్రభుత్వ కార్యక్రమాన్ని అధికారులు టీఆర్ఎస్ పార్టీ కార్యక్రమంగా మార్చారని ఆయన విమర్శించారు. బిజెపి నాయకులు పరుశరాం, రాంమోహన్ విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి

Related posts

వైసీపీ అరాచకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

Bhavani

అధికారికంగా సర్దార్ సర్వాయి పాపన్న వర్ధంతి

Satyam NEWS

75 శాతం మంది పెద్దలకు కరోనా వ్యాక్సినేషన్ పూర్తి

Satyam NEWS

Leave a Comment