27.7 C
Hyderabad
May 21, 2024 04: 43 AM
Slider ఖమ్మం

4723 చెక్కులకు గాను రూ.20.27కోట్ల పంపిణీ

#ajay

ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు తీసుకువచ్చిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఖమ్మం నగరం నుండి వివిధ అనారోగ్య కారణాలతో చికిత్స అనంతరం సీఎంఆర్‌ఎఫ్‌కి దరఖాస్తు చేసుకున్న వారికి మంజూరైన 184 చెక్కులను మంత్రి పువ్వాడ తన క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు స్వయంగా అందజేశారు. ఖమ్మం నుండి 184 మందికి గాను రూ.66.89లక్షల విలువైన చెక్కులను స్వయంగా పంపిణీ చేశారు. నేటి వరకు 4723 చెక్కులకు గాను రూ.20.27కోట్ల విలువైన చెక్కులు అందజేయడం సంతోషంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలకు ఆపత్కాలంలో సిఎం రిలీఫ్ ఫండ్ వరంలా మారిందని, ప్రజల ఆరోగ్యానికి తెలంగాణ ప్రభుత్వం భరోసా కల్పిస్తుందన్నారు. సిఎం కెసిఆర్  పేదల ఆరోగ్య పట్ల ప్రత్యేక శ్రద్ధను చూపుతున్నారని తెలిపారు.

నియోజకవర్గంలో ఇప్పటికే కోట్లాది రూపాయాలను సిఎం సహాయ నిధి నుంచి అందివ్వడం జరిగిందన్నారు. మునుపెన్నడూ ఇంత పెద్ద మొత్తంలో పెద్ద సంఖ్యలో పేదలకు లబ్ధి జరగలేదన్నారు. ఈ ప్రక్రియ నిర్విరామంగా కొనసాగుతుంది అని ఇకపై కూడా ఎక్కువ మొత్తంలో అందిస్తామని తెలిపారు. అనారోగ్యంతో బాధపడుతున్న నిరుపేదలు స్ధానిక నాయకుల ద్వారా మా దృష్టికి తీసుకువచ్చినా, నేరుగా తమ కార్యాలయానికి వచ్చిన వారికి అండగా ఉండి వారి ధరకాస్తును మంజూరు చేసే వరకు తమ  బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో అందించే వైద్యంతో సమానంగా ప్రభుత్వాసుపత్రుల్లో ఉచితంగా వైద్యం అందిస్తోందని, అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి సీఎంఆర్‌ఎఫ్‌ కింద సాయం అందించామన్నారు. కార్యక్రమంలో మేయోర్ పునుకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కురాకుల నాగభూషణం, సుడా ఛైర్మన్ విజయ్, బి‌ఆర్‌ఎస్  నగర అధ్యక్షుడు పగడాల నాగరాజ్, ఆర్‌జే‌సి  కృష్ణ, కార్పొరేటర్లు, నాయకులు ఉన్నారు.

Related posts

మానసిక వికలాంగురాలి పై అత్యాచారం

Satyam NEWS

క‌క్ష తీర్చుకోవ‌డానికే ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న సీఎం

Satyam NEWS

కరోనా విజృంభిస్తోంది అందరూ జాగ్రత్త

Satyam NEWS

Leave a Comment