26.7 C
Hyderabad
May 21, 2024 09: 25 AM
Slider మహబూబ్ నగర్

సర్కారు బడికి రామాపురం వాసి ఉడుత రాజమ్మ చేయూత

school 22

కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామ మాజీ సర్పంచ్ ఉడుత రాజమ్మ రామస్వామి యాదవ్ ప్రతీ సంవత్సరం గ్రామ సర్కారు పాఠశాలకు తనదైన శైలిలో సహాయ సహకారాలు అందిస్తున్నారు. తాను ఏటా సాయం చేసే స్కూల్ లో చదివిన ఆమె కుమార్తె అనిత యాదవ్ ఇటీవల ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా నియామకం పొందింది.

పాఠశాలతో ఏర్పడిన అనుబంధానికి కొనసాగింపుగానా అన్నట్లు తన కుమార్తె కూడా స్కూల్ టీచర్ కావడంతో ఉడుత రాజమ్మ మరింత సంతోష పడ్డారు. ఆమె తో బాటు సంతోషం పంచుకున్న పాఠశాల విద్యార్ధులు వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది, గ్రామ నాయకులు అనితను పాఠశాల ఆవరణలో ఘనంగా సత్కరించి, అభినందనలు తెలిపారు.

తల్లి బాటలోనే నడుస్తున్న ఉడుత అనిత యాదవ్ తన మొదటి నెల వేతనంలో పదివేల రూపాయల ఖర్చుతో  పాఠశాల పైన ముందు భాగంలో మహనీయుల రంగు రంగుల చిత్రాలు వేయించింది. అంతే కాకుండా ఇంగ్లీష్ నిఘంటువులు విద్యార్థులకు పంపిణీ చేసింది.

గతంలో కూడా విద్యార్థులకు టై, బెల్టులు, ప్లేట్లు, గ్లాసులు ఉచితంగా వితరణ చేస్తూ అందరికీ స్పూర్తిగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వారి తల్లి దండ్రులు రాజమ్మ రామస్వామి, గ్రామ సర్పంచ్ భారతి దర్గయ్య, MPTC వరలక్ష్మి రామ్ చందర్, ఉప సర్పంచ్ నాగమణి రాము, SMC వైస్ చైర్మన్ శిరీష, మాజీ సర్పంచ్ బాల్ రాజు, కలమూరి నిరంజన్ పాల్గొన్నారు. ఇంకా వార్డు మెంబర్లు అంజనేయులు, కిరణ్, గ్రామపంచాయితీ కో ఆప్షన్ మెంబర్స్ మాధవరావు, అంజనేయులు గౌడు, సాయిప్రకాష్, SMC మాజీ చైర్మెన్ చంద్రయ్య, HM సుధాకర్, ఉపాధ్యాయులు రుక్మద్దీన్, శంకర్ నాయక్, సతీష్, RTC కండక్టరు శంకర్ గౌడు, కానిస్టేబుల్ కుర్మయ్య, నాయకులు శరబంద, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

12 లక్షల మంది దళితులకు ప్రత్యామ్నాయం చూపండి

Bhavani

మూడు కార్పొరేషన్లకు కొత్త చైర్మన్ల నియామకం

Satyam NEWS

ఏప్రిల్ 1 నుంచి తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలు ప్రారంభం

Satyam NEWS

Leave a Comment