39.2 C
Hyderabad
May 3, 2024 13: 38 PM
Slider వరంగల్

12 లక్షల మంది దళితులకు ప్రత్యామ్నాయం చూపండి

#Marshal Durgam Nages

తెలంగాణ ఎమ్మెల్యేలు ఎంపీలు అసెంబ్లీలో, పార్లమెంట్లో ప్రస్తుతం జరిగే సమావేశాల్లో ఏజెన్సీ దళితుల సమస్యలపై మాట్లాడాలని సమతా సైనిక దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేష్ శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన హక్కులు ఏజెన్సీ దళితులకు వర్తించడం లేదని ఆవేదన చెందారు తాతలతండ్రుల కాలం నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో నివసిస్తున్న దళితులకు ,

పుట్టిన భూమిపై హక్కులు లేక రాజకీయ రిజర్వేషన్ లేక చదువుకున్న విద్యార్థులకు స్థానిక ఉద్యోగాల్లో అవకాశం లేక ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అభివృద్ధికి నోచుకోలేదని తెలిపారు. సాగు భూములకు, పోడు భూములకు హక్కు హక్కు పత్రాలు లేకపోవడంతో ప్రభుత్వాలు ప్రవేశపెట్టే రైతు బీమా రైతుబంధు బ్యాంకు రుణాలు సబ్సిడీ విత్తనాలు మొదలైన సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు.

రాజకీయం ఎదగాలన్న కనీసం సర్పంచ్ అయ్యే అవకాశం కూడా లేదన్నారు. విద్యార్థులకు డిగ్రీలు పేజీలు చదివిన జీవో 3 తో స్థానిక ఉద్యోగ నియమాకాల్లో అవకాశాలు లేక నిరుద్యోగులుగా ఉన్నారన్నారు. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో ఏజెన్సీ దళితులు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఏ రంగంలో చూసిన అభివృద్ధికి నోచుకోలేదని ఆవేదన చెందారు..

ఏజెన్సీ దళితుల అభివృద్ధి జరగాలంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి కొంత బడ్జెట్ కేటాయించాలని, దళిత వాడలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేయాలని, ఏజెన్సీ దళితులను ఏజెన్సీ వాసులకు గుర్తించి ఎస్టీలతోపాటు సమాన హక్కులు కల్పించాలని కోరారు. సుప్రీంకోర్టు జీవో త్రీ రద్దు తీర్పును పకడ్బందీగా అమలు చేస్తూ ఏజెన్సీ ఉద్యోగ నియామకాల్లో రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటిస్తూ ఉద్యోగ నియామకాలు చేపట్టాలని కోరారు.

Related posts

రక్తదానం చేసిన సాయిధరమ్ తేజ్ యువత

Satyam NEWS

డెంగ్యూ పట్ల అప్రమత్తంగా ఉండాలి

Bhavani

అరెస్టుకు ముందు సంచలన వీడియో విడుదల చేసిన పట్టాభి

Satyam NEWS

Leave a Comment