35.2 C
Hyderabad
May 21, 2024 16: 36 PM
Slider శ్రీకాకుళం

అంబేద్కర్ దళిత నేత కాదు దేశ నేత

#Ambedkar

భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్ అంబేద్కర్ దళిత నేత కాదని దేశ నేతని ఆయన సిద్ధాంతాలే దేశానికి శరణ్యమని రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు, వైకాపా రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి నాగ్  అన్నారు.

బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను రాష్ట్రంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లా బూర్జ మండలం కంట్లాంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు

ఈ కార్యక్రమంలో అంబేద్కర్స్ ఇండియా మిషన్ ప్రతినిధులు, ఎఐమ్ సైనికులు పెద్ద సంఖ్యలో పాల్గోన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సభలో తమ్మినేని చిరంజీవి నాగ్ మాట్లాడుతూ  అమరావతిలో అంబేద్కర్ స్మృతి వనం ఏర్పాటు చేస్తుండడం శుభపరిణామమన్నారు.

వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తుందన్నారు. దళితులకి సముచిత స్థానం కల్పించడంతో పాటు వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటుందన్నారు. రాష్ట్రంలో ఏ సంక్షేమ పథకం ప్రవేశపెట్టినా దళితులు లబ్ధిపొందేలా చూస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత పక్షపాతిగా నిలుస్తున్నారన్నారు.

తెదేపా హయంలో దళితులకు అన్యాయం

జగన్ సర్కార్ ప్రవేశపెట్టిన అమ్మ ఒడి,నాడు-నేడు,ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ బోధన వంటి కార్యక్రమాల వల్ల దళితులకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. తెదేపా హయాంలో దళితులు అన్ని విదాలుగా అన్యాయానికి గురయ్యారన్నారు. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులకు అండగా నిలుస్తుందన్నారు.

దళితులపై దాడులు జరిగితే తక్షణం స్పందించి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా విగ్రహ దాత ,పి.వి.ఎస్ రామ్మోహన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత రామ్మోహన్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆశయాలు ఎంతో గొప్పవన్నారు.

అటువంటి మహానీయుడును ప్రతి ఒక్కరు గౌరవించాలన్నారు. తమ ట్రస్ట్ తరపున అంబేద్కర్ విగ్రహాలను ఏర్పాటు చేసేందుకు సహకరిస్తున్నామన్నారు. జాతిపిత మహాత్మ గాంధీ విగ్రహాలతో పాటు అంబేద్కర్ విగ్రహాలను ట్రస్ట్ తరపున అందజేస్తున్నామన్నారు.

అంతేకాకుండా నిరుపేదల చదువుల కోసం,వైద్య సహాయాల కోసం కూడా ట్రస్ట్ కృషి చేస్తుందన్నారు. గ్రామాల్లో గ్రంధాలయాలు ఏర్పాటు చేస్తే ఉచితంగా పుస్తకాలను అందజేస్తామన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్స్ ఇండియా మిషన్ జిల్లా కన్వీనర్ ,రాష్ట్ర డిజిటల్  మీడియా మోనిటరింగ్ కమిటీ సభ్యులు తైక్వాండో శ్రీను మాట్లాడుతూ  ఎఐమ్ వ్యవస్థాపకులు పి.వి.సునిల్ కుమార్ నాయకత్వంలోనే దళితుల అభ్యున్నతి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేసారు.

అంబేద్కర్ ఆశయాల సాధన కోసం పి.వి.సునీల్‌ కుమార్‌ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ యజ్ఞంలో భాగస్వామ్యులు కావాలని ఆయన కోరారు. ఎఐమ్ సైన్యం అంతా కూడా పి.వి.సునిల్ కుమార్ నాయకత్వాన్ని బలపరచి కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్ళాలన్నారు.

దళితుల అభ్యున్నతి కోసం కృషి

అంబేద్కర్‌ కలలు గన్నదళితు అభ్యున్నతిని సాధించడం కోసం పి.వి.సునీల్‌ కుమార్‌ చేస్తున్న కృషిలో  భాగస్వామ్యువుతుండడం ఆనందంగా ఉందన్నారు.  ఈ సందర్భంగా జోనల్ ఇన్ చార్జి మాతా శ్యామ్యుల్ సుధాకర్  మాట్లాడుతూ పి.వి.సునిల్ కుమార్ దళితుల కోసం చేస్తున్న కృషికి అండగా నిలవడంతో పాటు  దళిత స్వపరిపాలనను సాధించుకునేందుకు ప్రతి ఒక్కరు నడుంబిగించా న్నారు.

ఎఐమ్ ను మరింత బలోపేతం చేయాలని పేర్కోన్నారు. ఆ దిశగా ప్రతి పల్లెల్లో కూడాఎఐమ్ ఎజెండాను తీసుకువెళ్ళడం కోసం అంతా సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమానికి ఎఐమ్ సైనిక్ కన్వీనర్ కళ్లేపల్లి హరి కృష్ణ అధ్యక్షత వహించగా ఎఐమ్ సైనిక్ జిల్లా కార్యదర్శి పెయ్యల చంటి,ఎఐమ్ సైనికులు గుజ్జల సూర్యనారాయణ( ప్రభాష్ సూరి) ,బూర ఆనంద్ కుమార్ ,సనత్ ,బూర్జ ఎఐమ్ సైనికులు ఆదినారాయణ,లింగాల రవితో పాటు గ్రామస్తులు ఎఐమ్ సభ్యులు తదితరులంతా పాల్గొన్నారు.

Related posts

29,30 తేదీలలో తుంగతుర్తి మండల స్థాయి ఆటల పోటీలు

Bhavani

కొత్త ఇసుక పాలసీ సిద్ధం: మాఫియాపై కొరడా

Satyam NEWS

కరోనా నుంచి కోలుకున్న బిజెపి నాయకుడు

Satyam NEWS

Leave a Comment