38.2 C
Hyderabad
May 2, 2024 22: 36 PM
Slider కడప

సమన్వయంతో ఇళ్ల పట్టాల పంపిణీని విజయవంతం చేద్దాం

#SrikanthReddy

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమ విజయవంతానికి రెవెన్యూ, హౌసింగ్, మున్సిపల్ శాఖల సమన్వయం ఎంతో అవసరమని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి అన్నారు. రాయచోటి లోని తన కార్యాలయంలో  శుక్రవారం  తహసీల్దార్ లు, ఎం పి డి ఓ లు, హౌసింగ్, మున్సిపల్ అధికారులుతో డిసెంబర్ 25 న పంపిణీ చేసే ఇంటి నివేశన పట్టాలపై శ్రీకాంత్ రెడ్డి సమీక్షించారు.

అర్హత గల ప్రతి పేదింటి మహిళల పేరుతో తయారుచేసిన నివేశన పట్టా పత్రాలును పంపిణీకి సిద్ధం చేయాలన్నారు. అన్నమయ్య అర్బన్ డెవెలప్ మెంట్ అథారిటీ( ఆడా) పరిధిలోని అన్ని గ్రామాలలో పట్టాలతో పాటు పక్కా భవనాల నిర్మానాలును   రూ.1.80 లక్షలుతో  ప్రభుత్వం చేపట్టనుందన్నారు. రాయచోటి టౌన్ పరిధిలో 9 వేలు, గాలివీడు 863, లక్కిరెడ్డిపల్లె 350, రామాపురం 362,చిన్నమండెం 281, సంబేపల్లె 340 వంతున పక్కా భవనాలు మంజూరయ్యాయన్నారు.

మొదటి విడతగా చేపట్టనున్నటువంటి ఇళ్ల పట్టాల పంపిణీ, పక్కా భవన నిర్మాణాల ప్రారంభాల విజయవంతానికి అన్ని శాఖల అధికారులు, క్షేత్ర స్థాయి సిబ్బందితో కలసి ముందుకు సాగాలన్నారు. అలాగే ఇంటి పట్టాలు పంపిణీ చేసిన ప్లాట్ల పరిధిలో  అవసరమైన మౌలిక వసతుల కల్పనాచర్యలును చేపట్టాలన్నారు. ముఖ్యంగా రోడ్లు, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ తదితర వసతుల కల్పన పై దృష్టిసారించాలన్నారు.పక్కా గృహాల నిర్మాణాలు చేపట్టే ప్రతి ఇంటి ముందు  పూల మొక్కలు, చెట్లను పెంచేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు.పట్టాల పంపిణీ లో ఎటువంటి పొరపాట్లు దొర్లకుండా జాగ్రత్తలు వహించాలని శ్రీకాంత్ రెడ్డి సూచించారు.

ప్రభుత్వ భూముల గుర్తింపులో కఠినంగా వ్యవహరించాలి…

రాబోయే అవసరాల దృష్ట్యా ప్రభుత్వ భూములను గుర్తించి ,వాటిని కాపాడే విషయంలో కఠినంగా వ్యవహరించాలని తహసీల్దార్ లకు శ్రీకాంత్ రెడ్డి సూచించారు. పట్టణ కేంద్రాలు, మండల కేంద్రాలలో 5 సెంట్ల ప్రభుత్వ భూములున్నా వాటిని కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.త్వరలో చేపట్టనున్న సమగ్ర భూసర్వేకి సన్నద్ధం కావాలన్నారు. జనవరి 1 నుంచి ప్రారంభమయ్యే ఈ సర్వే వల్ల ఎటువంటి ఇబ్బందులు, సమస్యలు తలెతవన్న విషయాన్ని ప్రజలకు తెలియపరచాలన్నారు. ఇందుకోసం క్షేత్ర స్థాయిలో  వి ఆర్ ఓ లు, సచివాలయ సిబ్బంది , వాలంటీర్లు ప్రభుత్వం చేపట్టనున్న ఈ సర్వే గురించి అవగాహన కల్పించాలన్నారు.

వైఎస్ఆర్ జలకళ లబ్ధిదారుల గుర్తింపులో వేగం పెంచాలి..

వైఎస్ఆర్ జలకళ  పథకం ద్వారా అర్హుకందరికీ బోర్లను మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాంత్ రెడ్డి అధికారులుకు సూచించారు. బోర్ల తవ్వకాలలో సన్న, చిన్న కారు  రైతులకు ఉచిత బోర్లుతో పాటు విద్యుత్, మోటార్ సౌకర్యం ప్రభుత్వం కల్పిస్తోందన్నారు.

 ఈ కార్యక్రమంలో  నియోజక వర్గ పరిధిలోని మండలాల తహసీల్దార్ లు, ఎం పి డి ఓ లు, హౌసింగ్ అధికారులు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఎస్వీ గోశాలలో ఘనంగా గోపూజ మహోత్సవం

Bhavani

సమ్మెలో ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగులు కూడా పాల్గొంటారు

Satyam NEWS

వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఆశ్రా సేవలు అభినందనీయం

Bhavani

Leave a Comment