41.2 C
Hyderabad
May 4, 2024 18: 06 PM
Slider వరంగల్

అభం శుభం తెలియని పసి మనసులు పరిమళించాలి

#ChildrenRightsWeek

అంతర్జాతీయ బాలల వారోత్సవాలను పురస్కరించుకొని ములుగు ఎంపీడీవో కార్యాలయంలో నేడు వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా  జిల్లా సంక్షేమ అధికారినీ  E.P ప్రేమలత విచ్చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అందరూ అనుభవించే బాల్యం.. భగవంతుడు ఇచ్చిన ఓ అమూల్యమైన వరం.

అభం శుభం తెలియని ఆ పసి మనసులు పూతోటలో అప్పుడే పరిమళించిన పువ్వులు. అందుకు సూచకంగా ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలలో బాలల దినోత్సవంలు జరుపుకుంటారు. అలాగే మనదేశంలోనూ బాలల దినోత్సవం జరుపుకుంటారు. 

అదేవిధంగా పిల్లలకి వారి పరిశుభ్రత గురించి, మంచి స్పర్శ, చెడు స్పర్శ గు, అక్రమ రవాణా , బాల్య వివాహాల గురించి, బాలలపై లైంగిక దాడుల గురించి వాళ్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పిల్లలకి ఎలా ఉంటే బాగుంటుంది అన్న విషయాలపై అవగాహన కలిగించారు.

బాల బాలికలకు అవగాహన కల్పించాలి

బాలల స్వేచ్చాయుత ఎదుగుదలను అడ్డుకోకుండా అనేక కార్యక్రమాలను చేపట్టి వారికి అవగాహన కల్పించాలని అలా చేయడం వల్ల పిల్లల్లో చైతన్యం కలుగుతుందని వారి భవిష్యత్తుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ముందుకు వెళ్తారని, అందుకు ప్రతి తల్లితండ్రి వారి సమస్యల పట్ట ఎప్పటికప్పుడు తెలుసుకొంటూ రక్షణ సంరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు.

పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వెంటనే 1098 చైల్డ్ లైన్ నంబర్ కి ఫోన్ చేసి చెప్పవల్సిందిగా తెలియజేశారు. అదేవిధంగా ఫోన్ చేసిన వారి వివరాలు గోప్యంగా  ఉంచుతామని తెలిపారు.

అనంతరం చైల్డ్ లైన్ టీం నుండి  రకరకాల ఇబ్బందులను ఎదుర్కొని వారి సమస్యలను పరిష్కరించుకొని వారు ఉన్నత స్థాయికి ఎదగాలని ఆలోచన భావాన్ని మార్చుకున్న పిల్లలకు బహుమతులు ఇస్తూ, వారిని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో బాల రక్షా భవన్ కోఆర్డినేటర్ కే.స్వాతి,ఎస్సై హరికృష్ణ,  చైల్డ్ ప్రాజెక్టు డెవలప్మెంట్ ఆఫీసర్ లక్ష్మి,  డిస్టిక్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ j.ఓంకార్,  ఐసిడిఎస్ సూపర్వైజర్లు భాగ్యలక్ష్మి, అరుణ, డి సి పి యు టీం, చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ ప్రభ, చైల్డ్ లైన్ టీం, అంగన్వాడి టీచర్లు బాలబాలికలు పాల్గొన్నారు.

Related posts

జైలు నుంచి విడుదలైన టీడీపీ నేతకు సంఘీభావం

Satyam NEWS

రాజు వయ్యా మహరాజు వయ్యా…..

Satyam NEWS

డీఎస్పీ పాపారావు అకాల మరణం తీరని లోటు

Satyam NEWS

Leave a Comment