మనవాడైతే చాలు దోచి పెట్టేయ్ అన్నట్లుంది జగన్ ప్రభుత్వం తీరు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల ప్రెస్ అకాడమీ చైర్మన్ గా దేవిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని నియమించింది. సాధారణంగా ఏ ప్రభుత్వంలోనైనా నామినేట్ చేసే సమయంలోనే ఇచ్చే వేతనం, ఎంత కాలం పదవిలో ఉంటారు అనే అంశాలు నిర్ణయిస్తారు.
అయితే వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మాత్రం ముందుగా అప్పాయింట్ మెంట్ ఆర్డర్ వస్తుంది. అందులో కేవలం అప్పాయింట్ అయినట్లు మాత్రమే సమాచారం ఉంటుంది. ఆ తర్వాత వారికి ఎంత వేతనం ఇస్తారనే విషయం స్పష్టం చేస్తూ ప్రత్యేక ఉత్తర్వులు వస్తాయి. అందులో కొందరికి ఎంత కాలం ఆ పదవి ఉంటుంది అనేది స్పష్టం చేస్తారు. మరి కొందరికి అదీ ఉండదు.
ప్రెస్ అకాడమీ చైర్మన్ కు నెలకు రూ. రెండు లక్షల వేతనాన్ని ఫిక్స్ చేస్తూ నేడు ఉత్తర్వులు వచ్చాయి. ఇంతేనా అంటే కాదు. ఇంకా ఉంది. ప్రెస్ అకాడమీ చెర్మన్ వ్యక్తిగత సహాయ సిబ్బంది, వాహన ఎలవెన్సు, ఇంటి అద్దె తదితర భత్యాలు కలుపుకుంటే ఆయనకు నెలకు రూ.3.82 లక్షల మొత్తం చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. చాలా ఇంకా కావాలా అని అడగలేదు అదొక్కటే ఆర్డర్ లో లేదు. కేవలం ఒక్క శ్రీనాథ్ రెడ్డి కే కాదు.
అంతకు ముందు సలహాదారుడుగా అప్పాయింట్ అయిన దేవులపల్లి అమర్ కు కూడా ఇదే స్థాయిలో జీత భత్యాలు ఇచ్చారు. ఇప్పటి వరకూ నియమితులనైన సలహాదారులందరికి ఇంతే భారీ స్థాయిలో జీత భత్యాలు ఇస్తున్నారు. ఎవరు ఎన్ని విమర్శించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పట్టించుకోవాలని కూడా అనుకోవడం లేదు. అందరూ హ్యాపీ.