29.7 C
Hyderabad
April 29, 2024 07: 34 AM
Slider ప్రపంచం

ఆకాశ హర్మ్యం బుర్జు ఖలీఫా కట్టిన కంపెనీ దివాలా

#Arabtech

ప్రపంచ ప్రఖ్యాత ఆకాశహర్మ్యం బుర్జు ఖలీఫా నిర్మించిన రియల్ ఎస్టేట్ కంపెనీ అరబ్ టెక్ దివాలా తీసింది. 2009 దుబాయ్ లో తలెత్తిన ఆర్ధిక సంక్షోభంతో కుదేలైన అరబ్ టెక్ అప్పటి నుంచి కుంటుతూ నడుస్తూనే ఉంది.

2014లో అరబ్ టెక్ మరో సంక్షోభానికి గురైంది. ఆ కంపెనీ షేర్లు 60 శాతం మేరకు పతనం కావడంతో ఒక కోలుకోలేకపోయిన అరబ్ టెక్ ఇప్పుడు కరోనా కారణంగా పతనమైన ఆర్ధిక వ్యవస్థ కారణంగా పూర్తిగా దివాలా తీసింది.

 1975లో ప్రారంభమైన అరబ్ టెక్ ఎన్నో అద్భుతమైన భవంతులను నిర్మించి అరబ్ దేశాలకు ప్రాభవాన్ని తెచ్చిపెట్టింది. అరబ్ టెక్ నిర్మించిన హోటళ్లు అక్కడి పర్యాటక రంగానికి ఊతమిచ్చాయి.

ఇవన్నీ ఇప్పుడు గత చరిత్రలో కలవబోతున్నాయి. అరబ్ టెక్ పూర్తిగా దివాలా తీయడంలో వేలాది మంది ఉద్యోగాలు కోల్పోబోతున్నారు.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్ధిక సంక్షోభం నుంచి కోలుకోలేకపోవడంతో అరబ్ టెక్ నష్టాలు చవి చూసింది. దానికి ఇప్పుడు కరోనా మహమ్మారి తోడు కావడంతో పర్యాటక రంగం కూడా పూర్తిగా దెబ్బతిని పోయి నష్టాలు ఆవరించాయి.

 అసలే ఆర్ధిక సంక్షోభంలో ఉన్న దేశంలో కరోనా వైరస్ వల్ల పరిస్థితి మరింత క్షీణించిందని అందువల్ల తాము పూర్తిగా దివాలా తీశఆమని అరబ్ టెక్ చైర్మన్ వలీద్ అల్ ముహైరీ తెలిపారు.  

Related posts

శ్రీకృష్ణ సత్యభామ రూపిణీ సమేత కళ్యాణం

Satyam NEWS

అక్రమాలకు పాల్పడుతున్న సర్పంచ్ పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

రైల్లోనే తుపాకితో కాల్చుకుని చనిపోయిన కానిస్టేబుల్

Satyam NEWS

Leave a Comment