27.7 C
Hyderabad
May 22, 2024 06: 31 AM
Slider మెదక్

రూ.1500 కోట్లతో మల్లన్నసాగర్‌ వద్ద పర్యాటక క్షేత్రం

#mallannasagar

మల్లన్నసాగర్‌ జలాశయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం కేసీఆర్‌ చేసిన ప్రకటన మేరకు మల్లన్నసాగర్‌ వద్ద  పర్యాటక క్షేత్రం ఏర్పాటు కాబోతున్నది. నిర్మాణం కోసం సమగ్రమైన ప్రణాళికల రూపకల్పనకు చర్యలు ప్రారంభిస్తున్నారు. మల్లన్నసాగర్‌ పర్యాటక క్షేత్రం, మల్లన్నసాగర్‌ ఆ పక్కనే యాదాద్రి, ఈ పక్కన కొమురెల్లి మల్లన్న ఆలయం.. కొండపోచమ్మ ,రంగ నాయక సాగర్ బస్వాపూర్‌.. అన్నీ ప్రాంతాలు హైదరాబాద్‌కు దగ్గరగా ఉన్నాయి. కనువిందుచేసే ప్రకృతి  సౌందర్యాలున్నాయని చుట్టూ ఆకుపచ్చదనంతో అలరారే ప్రాంతమిది. వాటన్నింటినీ కలిపి అద్భుతమైన టూరిజం హబ్‌ గా తీర్చిదిద్దుతారు.

మల్లన్నసాగర్‌ జలాశయం వద్ద పర్యాటక క్షేత్రం ఏర్పాటు చేయాలని, ఇందుకోసం రూ.1500 కోట్లను మంజూరు చేస్తున్న’ అని బుధవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని అందుకు  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానని టూరిజం చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్త అన్నారు. రాష్ట్రంలో ఉన్న రిజర్వాయర్లన్నీ కూడా చక్కని పర్యాటక ప్రాంతాలుగా  తీర్చిదిద్ది, దేశవిదేశీ టూరిస్టులను ఆకర్షించాలని, సినిమా షూటింగ్‌లు సైతం జరిగేలా అద్భుతంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారని అన్నారు.

సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం పరిధిలోని 33 జిల్లాల్లోని  అన్ని ప్రాంతాలలో, అభివృద్ధి పనులు ముమ్మరంగా సాగుతున్నాయని అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా తెలంగాణ టూరిజం, రాష్ట్ర టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ టూరిజంను ఒక హబ్ లాగా తీర్చిదిద్దుతామని అన్నారు. ఏడాదిన్నర లోగా పర్యాటక ప్రాజెక్టును పూర్తిచేయడానికి పర్యాటక శాఖ చర్యలు చేపట్టిందని అన్నారు. ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు, ఐటీ మంత్రి కేటీఆర్, జిల్లా మంత్రి హరీష్ రావు, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ సలహాలు, సూచనలతో సమగ్ర ప్రణాళిక చేసి మల్లన్నసాగర్‌ ప్రాంతాన్ని అద్భుతమైన పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తామని అన్నారు.

Related posts

కామారెడ్డి జిల్లాలో కరోనా వ్యాక్సినేషన్ ఏర్పాట్లు పూర్తి

Satyam NEWS

చేనేత కళాకారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

కంప్లయింట్: మలాలా చిత్ర దర్శకుడికి ఫత్వా

Satyam NEWS

Leave a Comment