38.2 C
Hyderabad
April 28, 2024 19: 29 PM
Slider హైదరాబాద్

చేనేత కళాకారులకు నిత్యావసర వస్తువుల పంపిణీ

#Weavers Welfare

సాయిని వెంకటేశం పుష్పాలత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేనేత కళాకారులకు నేడు నిత్యావసర వస్తువుల పంపిణీ జరిగింది. కరోనా మహమ్మారి విజృంభనతో 60 రోజులుగా చేయడానికి పనిలేక చేతిలో చిల్లిగవ్వ లేక ఇబ్బందులు పడుతున్న చేనేత కళాకారులకు హై కోర్ట్ న్యాయవాది సాయిని వెంకటేశం ఆపన్న హస్తం అందించారు.

హైదరాబాద్ శివారులోని హయత్ నగర్ లో శ్రీనివాస కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో సాయిని వెంకటేశం పుష్పాలత చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 50 మంది చేనేత కళాకారులకు 10 కిలోల బియ్యం, వంట నూనె, కంది పప్పు, కారం పొడి, సబ్బులు అందజేశారు.

అఖిల భారత పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు కందగట్ల స్వామి, పద్మశాలి మిషన్ సంస్థ ప్రధాన కార్యదర్శి ప్రొఫెసర్ తడక యాదగిరి, అఖిల భారత పద్మశాలి సంఘ మహిళ విభాగం అధ్యక్షురాలు వనం దుష్యంతల, అఖిల భారత పద్మశాలి సంఘం న్యాయ విభాగం అధ్యక్షులు వనం విశ్వనాథం, అఖిల భారత పద్మశాలి సంఘ యువజన విభాగం జాతీయ అధ్యక్షులు గుండేటి శ్రీధర్ కార్యక్రమంలో పాల్గొని చేనేత కళాకారులకు నిత్యావసర వస్తువులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎల్బీ నగర్ చేనేత కార్మికుల సంఘం అధ్యక్షుడు చెరుకు స్వామి మాట్లాడుతూ చేనేత కార్మికుల ఆకలి తీరుస్తున్న సాయిని వెంకటేశం గారికి, ట్రెస్ట్ సభ్యులకు ధన్యవాదములు తెలిపారు.

Related posts

ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేస్తున్న ముఠా అరెస్ట్

Satyam NEWS

ఎమ్మెల్యే అభ్యర్ధులకు కొత్త టార్గెట్?

Bhavani

ఇసుక అక్రమ తవ్వకాలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవు

Satyam NEWS

Leave a Comment