34.2 C
Hyderabad
May 21, 2024 18: 49 PM
Slider ఆధ్యాత్మికం

వైభవంగా పైడితల్లి అమ్మవారి పందిరాట ఉత్సవం..

#paiditalli

విజయనగరలో పందిరి రాట మహోత్సవం తో పైడి తల్లి అమ్మ వారి  నెల రోజుల పండుగ ఉత్సవం ప్రారంభమైందని నగర మేయర్  వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. ఉత్తరాంధ్ర ఇలవేల్పు, విజయనగరం ప్రజల ఆరాధ్య దేవత శ్రీ పైడితల్లి అమ్మవారి  పందిరి రాట ఉత్సవం ఘనంగా జరిగింది.

ముందుగా వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ ఈ సరపు రేవతీదేవి లు పందిరి రాటకు  ప్రత్యేక పూజలు చేసి, అమ్మవారి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. జై పైడిమాంబా, జై జై  పైడిమాంబ నినాదాలతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ అమ్మ పండుగ అంటే నెల రోజుల పండుగని, పందిరి రాట మహోత్సవం తో నేడు శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. అక్టోబర్ 18 న తోలేళ్ళ ఉత్సవం, 19 న సిరిమానోత్సవం  జరుగుతుందని అని అన్నారు.

నగరపాలక సంస్థ తరుపున ఉత్సవానికి తగిన ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఎక్కడా జరగని రీతిలో రెండున్నర శతాబ్దాలకు పైగా అప్రతిహతంగా సాగుతున్న పైడి తల్లి అమ్మ వారి పండుగ ప్రతి ఏటా కూడా శోభాయమానంగా, భక్తి భావ తేజోమయం గా జరుగుతోందని అన్నారు. అమ్మ పండుగ అంటే కేవలం ఉత్తరాంధ్ర కే పరిమితం కాకుండా అటు ఒరిస్సా, చత్తీస్ ఘడ్, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారని అన్నారు.

గత రెండేళ్ల నుంచి కరోనా నేపథ్యంలో ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉత్సవం జరుగుతోందన్నారు. లోకాలను పాలించే పసిడి తల్లి పైడితల్లి అని, ఆమె పేరుతలిస్తెనే జన్మ ధన్యం అని అన్నారు. సిరులు కురిపించే కల్పవల్లిగా, కష్టాలను తొలగించే చల్లని తల్లిగా అమ్మ పూజలు అందుకుంటూ ఉందని అన్నారు.

అనంతరం వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్న అమ్మవారి  దీక్షాధారణ పీఠాన్ని సందర్శించి, ప్రత్యేక పూజలు చేశారు. జ్యోతి వెలిగించి దీక్ష పీఠాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా దీక్షా పీఠం నిర్వాహకులు ఆర్ఎస్ పాత్రో, అచ్చి రెడ్డి లు వారికి స్వాగతం పలికారు.

ఈ సందర్భంగా నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా దీక్షా పీఠం ఆధ్వర్యంలో భక్తులు  41 రోజులపాటు మాలధారణ చేస్తూ, అమ్మ సేవలో తరించడం గొప్ప విషయం అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్, ఆలయ పూజారి వెంకటరావు, కార్పొరేటర్లు  యవర్ణ విజయలక్ష్మి, మీసాల రమాదేవి, మాజీ శాసన మండలి సభ్యులు శ్రీనివాసులు నాయుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యవర్న కుమార స్వామి, పిల్ల రామకృష్ణ, మీసాల మధు, పతివా డ వెంకట రావు తదితరులు ఉన్నారు.

Related posts

మంత్రి నాని- మెడలో క్రాస్ – శ్రీవారి దర్శనం

Satyam NEWS

పెండింగ్ స్కాలర్ షిప్ లను వెంటనే విడుదల చేయాలి

Satyam NEWS

లైంగిక ఆరోపణలతో మంత్రి పదవికి రాజీనామా

Sub Editor

Leave a Comment