25.2 C
Hyderabad
May 16, 2024 22: 00 PM
Slider నల్గొండ

ఈనెల 27న జరిగే భారత్ బంద్ ను విజయవంతం చేయాలి

#roshapati

సిమెంటు పరిశ్రమలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు వేజ్ బోర్డు ప్రకారం కనీస వేతనం 24 వేల రూపాయలు ఇవ్వాలని,  ఉద్యోగ భద్రత కల్పించాలని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు కృష్ణ పట్టి ఏరియా సిమెంట్ క్లస్టర్ కమిటీ సమావేశంలో రోషపతి మాట్లాడుతూ ఇల్లు కట్టాలన్నా,రోడ్డు వేయాలన్నా,ఒక ప్రాజెక్టు నిర్మించాలన్నా సిమెంట్ కావాలని, ప్రపంచంలోనే అతి పెద్ద పరిశ్రమలు భారతదేశంలో ఉన్నాయని,అట్టి ముఖ్యమైన పరిశ్రమలో పని చేస్తున్న కార్మికుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని అన్నారు.

కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 29 చట్టాల సవరణ చేస్తూ నాలుగు లేబర్ కోడ్ లు  చేసినా కార్మిక చట్టాన్ని రద్దు చేయాలని, పిఎఫ్,ఈఎస్ఐ గ్రాడ్యుయేట్ కట్టాలని, ఐదు సంవత్సరాలు పనిచేసిన వారిని పర్మెంట్ చేయాలని తదితర డిమాండ్లతో ఈనెల 28,29 తేదీలలో జరిగే కార్మిక గర్జన,జీపు జాతాకు పెద్ద ఎత్తున కార్మికులు కదిలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నల్లచట్టాల రద్దుకై ఈ నెల 27న జరిగే భారత్ బంద్ లో కార్మికులందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యులు రాంబాబు,యలక సోమయ్య గౌడ్,రాధాకృష్ణ,జిల్లా కమిటీ సభ్యులు వట్టపు సైదులు,లకవత్ బాలాజీ నాయక్,ఆదినారాయణ,రణమియా తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

ఏపీయూడబ్ల్యూజే జిల్లా సభలకు మీరు రావాలి…!

Satyam NEWS

మార్చి 23న సేవ్ జర్నలిజం డే

Satyam NEWS

రెండు నియోజకవర్గాలల్లో కువైట్ బాలయ్య ఫ్యాన్స్ అన్న వితరణ

Satyam NEWS

Leave a Comment