27.7 C
Hyderabad
May 21, 2024 06: 03 AM
Slider ప్రపంచం

5జీ నుంచి డ్రోన్​ పాలసీ వరకు.. క్వాల్​కామ్​ సీఈవోతో ప్రధాని మోదీ చర్చ

భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ సెమీకండక్టర్, సాఫ్ట్​వేర్​ సంస్థ క్వాల్​కామ్ సంస్థ సీఈవో క్రిస్టియానో అమాన్​తో సమావేశమయ్యారు. భారత్​లో 5జీ, ప్రైమ్​ మినిస్టర్ వైఫై యాక్సెస్ నెట్​వర్క్ ఇంటర్ఫేస్ స్కీమ్, కొత్త డ్రోన్ పాలసీ, పబ్లిక్ వైఫై సహా మరికొన్ని అంశాల​ గురించి చర్చించారు.

ఎలక్ట్రానిక్​ సిస్టమ్ డిజైన్​, మ్యానుఫాక్చరింగ్​తో పాటు భారత్​లో సెమీకండక్టర్ల సప్లై చైన్​ అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ప్రొడక్షన్​ లింక్డ్​ ఇన్సెంటివ్​ స్కీమ్ గురించి సమాలోచలు జరిపారు. భారత డిజిటల్ ట్రాన్స్​ఫర్​మేషన్​ ప్రోగ్రామ్స్​లో భారత్​తో కలిసి పని చేసేందుకు క్వాల్​కామ్ సీఈవో అమాన్​ ఆసక్తి చూపారని, చర్చలు సఫలీకృతమయ్యాయని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Related posts

శుభసంకల్పం

Satyam NEWS

రామలింగారెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి ఇంద్రకరణ్

Satyam NEWS

పైడితల్లి అమ్మ వారిని దర్శించుకున్న డిప్యూటీ స్పీకర్

Satyam NEWS

Leave a Comment