38.2 C
Hyderabad
May 5, 2024 20: 22 PM
Slider కవి ప్రపంచం

శుభసంకల్పం

#shyamalanew

తమస్సుల తరిమి
ఉషస్సులనిస్తానంటూ
ఊరిస్తూ వచ్చింది ఉగాది
ఆనందంతోపొంగింది నా హృది
పేరులోఏముంది అనుకోవద్దు
పేరులోనేఉంది పెన్నిధి
ఉగాదిప్రసాదించే ఉషస్సులు
ఉర్విజనులకెల్ల ఆశీస్సులు
చిగిర్చిన ఈచైత్రం
నవచైతన్యానికి సంకేతం
హసించేవసంతం
జీవన వసంతప్రతిబింబం
మావికొమ్మల కోయిలమ్మల
గానం
ప్రజావళికి జయ మంగళ గీతం
ఓ మనిషీ!నీవు ఆశాజీవివి
నిన్ను బతికించే సంజీవనీ అదే
నిన్నటి నిరాశకు వీడ్కోలు పలికి
కొత్త ఆశలతో కదం తొక్కాలి
ఆశ పడితే అయిపోదు మనిషీ
చేయాలి నువ్వు నిరంతరకృషి
మంచిని పంచాలి ..పెంచాలి
సదాశయాల సాధనలో సాగాలి
అదే నీ సంకల్పం కావాలి

అప్పుడే ఈ వనిలో
ఆనందాల ఆమని విరిసేది
శాంతి.. సౌఖ్యం..సౌభ్రాతృత్వం
సర్వత్రా పెంపొందేది
శుభకృత్ పేరు సార్థకం అయ్యేది!

జె.శ్యామల


Related posts

వెంకటగిరి మున్సిపల్ చైర్ పర్సన్ కు అపూర్వ స్వాగతం

Satyam NEWS

పార్ట్ టైం టీచర్లను సీఆర్ టిలుగా రెగ్యులరైజ్ చేయాలి

Satyam NEWS

వెన్నెముక అయిన రైతు నడ్డివిరిచే చట్టాలు ఇవి

Satyam NEWS

4 comments

Pushpa April 2, 2022 at 11:51 AM

కవిత చాలా బాగుంది మేడం. ఉగాది శుభాకాంక్షలు మేడం.

Reply
Satyam NEWS April 2, 2022 at 2:39 PM

Thank you very much

Reply
Mramalakshmi April 2, 2022 at 3:36 PM

Kavitha chala bagundi madam.meeku ugadi subhakanshalu

Reply
Gannavarapu Narasimha Murty April 3, 2022 at 6:52 PM

ఉగాది మీద వ వ్రాసిన కవిత చాలా బాగుంది
అభినందనలు

Reply

Leave a Comment