35.2 C
Hyderabad
May 21, 2024 17: 04 PM
Slider విశాఖపట్నం

సొంత పార్టీ నేతపైనే ఉప ముఖ్యమంత్రి ప్రతాపం…

#anakapalli

సొంత పార్టీ వాళ్లనే ఎవరైనా వేధిస్తారా? వైసీపీ నాయకులైతే సొంత పార్టీ వారినే వేధిస్తారని…. పోలీసులతో అరెస్టు చేయిస్తారని మరొక్క మారు రుజువైంది. ఈ సారి ఈ ఘనకార్యం చేసిన వ్యక్తి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు. అనకాపల్లి జిల్లా వి.మాడుగుల నియోజకవర్గం దేవరాపల్లి మండలం వేచలం గ్రామానికి చెందిన ఒక పెద్దమనిషిని ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడి ఆదేశాలతో పోలీసులు అరెస్టు చేశారు. రెడ్డి బలరాం అనే ఈ పెద్ద మనిషికి ఆ గ్రామంలో ఎంతో మంచి పేరు ఉన్నది.

ఆయన ఎంపిటిసి ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధిగా గెలిచారు. ఎంపిటిసీగా తన విధులను తాను చిత్తశుద్ధితో నిర్వహిస్తున్నారు. అయితే ఇక్కడే ఒక చిక్కు వచ్చిపడింది. ఆయన ఎంతో నిజాయితీగా ఉంటారు. నిజాయితీగా ఉంటే వైసీపీ వాళ్లకు నచ్చదు కదా… అందుకే ఈ వేధింపులు. వేచలం గ్రామంలోని పాల కేంద్రానికి డైరెక్టర్ ను ఎన్నుకోవాల్సి ఉంది. ఆ ఎన్నికను నేడు ముహూర్తం పెట్టారు. బూడి ముత్యలనాయుడు తన మనిషిని గెలిపించుకోవాలని స్కెచ్ వేశారు. దానికి రెడ్డి బలరాం అడ్డు కూడా చెప్పలేదు.

అయినా సరే రెడ్డి బలరాం తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తారని బూడి ముత్యాల నాయుడు అనుమాన పడ్డారు. ఈ అనుమానం ఎందుకు వచ్చిందో అనే అనుమానం మీకు రావచ్చు. దానికి ఒక కథ ఉంది. బూడి ముత్యాలనాయుడి స్వగ్రామం వేచలానికి పైన ఉంటుంది. అక్కడ నీటి వనరులను ఆయనకు చెందిన వారే ఆపుకుంటుంటే తన గ్రామంలోని రైతుల కోసం రెడ్డి బలరాం అదేమని ప్రశ్నించారు. నీటి కాల్వలను అడ్డుకుంటే ఎలా అని ప్రశ్నించారు. అంతే…. ఈ కారణంగా రెడ్డి బలరాం ను ఉప ముఖ్యమంత్రి అనుమానించేశారు.

అలాంటి రెడ్డి బలరాం తన మనిషి పాల కేంద్రానికి ఎంపిక కాకుండా అడ్డుపడతాడేమోనని అనుమానించిన ఉప ముఖ్యమంత్రి తన బంటులైన పోలీసుల్ని పురమాయించారు. వెంటనే వారు రెడ్డి బలరామ్ ను అదుపులోకి తీసుకున్నారు. అదేమని అడిగితే పోలీసులు సమాధానం చెప్పలేదు. ఎందుకు అరెస్టు చేస్తున్నారంటే సమాధానం లేదు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యానాయుడు ఆదేశాలతో ముందస్తుగా అరెస్టు చేసి దేవరాపల్లి పోలీసులు పోలీసు స్టేషన్ కు తరలించారు.  

స్వంత పార్టిలో ఉన్న నన్ను ఎందుకు అరెస్టు చేసారంటూ బలరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా ఆయన మాట పట్టించుకున్నవాడు లేడు. రెడ్డి బలరాం గుండె జబ్బుతో బాధపడుతున్నారు. అయినా పోలీసులు కనికరించలేదు. గుండె జబ్బుతో బాధపడుతూ ఇంటి దగ్గర ఉన్న బలరాంను పోలీసులు బలవంతంగా పోలీసు స్టేషన్ కు తీసుకువచ్చారు.

ఆయనను ఎందుకు తీసుకువెళుతున్నారు ఆయనకు ఆరోగ్యం కూడా బాగాలేదు అని ఒక యువకుడు వేచలపు గోవిందు అడిగాడు.. అంతే అతడిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నా పరువు పోయింది నన్ను ఎందుకు పోలీసులు స్టేషన్ కు తీసుకువచ్చారు? సమాధానం చెప్పకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆ యువకుడు హెచ్చరించినా పోలీసులు చలించలేదు.

చివరకు పాలకేంద్ర ఎన్నిక ముగిసింది. ముత్యాలనాయుడి మనిషి నెగ్గాడు దాంతో సాయంత్రానికి వారిని పోలీసులు వదిలేశారు…. ఒక చిన్న ఎన్నిక… అదీ కూడా పాలకేంద్రం డైరెక్టర్ పదవి…. తన మనిషిని నెగ్గించుకోవాలనే తపనతో ఉప ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చేసిన అతి గొప్ప పని ఇది. ఇది చూసి అనకాపల్లి జిల్లాలోని అధికార వైసీపీ నేతలే అసహ్యించుకుంటున్నారు. ఉప ముఖ్యమంత్రి చర్యల్ని వారు తీవ్రంగా ఖండించారు.

Related posts

ఎన్నికల ఆరాటం లో మొదలైన పోరాటం

Satyam NEWS

వైదొలగిన ఉద్ధవ్: ‘‘నేను ఎక్కడికీ పోను… ఇక్కడే ఉంటా’’

Satyam NEWS

పర్ఫెక్ట్ క్లీనింగ్: బాసర ఆలయంలో పటిష్టంగా కోవిడ్ నియంత్రణ

Satyam NEWS

Leave a Comment