29.7 C
Hyderabad
May 22, 2024 01: 04 AM
Slider కవి ప్రపంచం

ప్రియా నేస్తమా

#PVS Krishnakumari

నీవు నా జీవితం లో ఒక భాగం

కాదు, కాదు

నీవే నా జీవితం

నా ప్రతి శ్వాస, ప్రతి అడుగు

నీవు ఇచ్చిన ప్రోత్సాహమే

నీవు లేనిది నా ఉనికే లేదు

పసి వయసులో చందమామ కథలతో

అలరించారు

విద్యార్ధి దశలో విజ్ఞాన సర్వస్వం

అంతా నీవు పెట్టిన భిక్షే

యౌవ్వనంలో అలజడి రేపే

చిలిపి ఊహలకి మూలం నీవే కదా!

కష్టంలో ఉన్నప్పుడు

వెన్నుతట్టి ధ్యైర్యాన్నిచ్చి

విజయపథం వైపు నడిపించిన

నీకంటే, ఆప్తులు మరెవరున్నారు నాకు?

అలసట చెందిన మనసుకు

ఆహ్లాదాన్ని న్నిచ్చే నేస్తానివి

ఏదో తెలియని అలజడి,అశాంతితో

నిదుర రాని రాత్రులలో

నాపక్కన నీవున్నావనే ధైర్యం

మనసుకు ఊరటనిస్తుంది.

నిను నా చేతులతో స్పృశించి నప్పుడు

కలిగే అలౌకికానందం

వర్ణించనలవి కాదు

ఓ పుస్తకమా!

నీ విలువ నేటి యువతరం

గ్రహించలేకుండా ఉంది

ఆన్ లైన్ పుస్తకం పేరుతో

సెల్ ఫోన్ కి అలవాటు పడిన

నేటి ప్రపంచంలో

మరుగున పడుతున్న

నీ అందమైన రూపానికి

పునర్జన్మ ఎప్పుడు వస్తుందో!

ప్రియా నేస్తమా,

నాకు మాత్రం నీవే నా సర్వస్వం

(ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా)

పీ.వి.యస్.కృష్ణ కుమారి

Related posts

ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ ద్వారా కరోనా పరీక్షలు చేయాలి

Satyam NEWS

బంగాళాఖాతంలో ‘అసని’ తీవ్రతుపాను

Satyam NEWS

విద్వేషాలను రెచ్చగొట్టే కేసీఆర్… ముందు క్షమాపణ చెప్పు

Satyam NEWS

Leave a Comment