రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, అసెంబ్లీ స్పీకర్ తనపై తీవ్రమైన విమర్శలు చేశారని, ఈ కారణంగా వైసీపీ కార్యకర్తలు ఉద్రిక్తతలకు లోనైతన పై దాడి చేసే అవకాశం ఉందని చెబుతూ కేంద్ర హోం శాఖ కార్యదర్శికి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ లేఖ రాసినట్లు వస్తున్న విషయం కరెక్టా కాదా అనే అంశంపై ఇంకా వివాదం కొనసాగుతుండగానే ఆయనకు భద్రత పెంచారు. విజయవాడలోని రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో గన్నవరం – 39 వ బెటాలియన్ సీఆర్పీఎఫ్ జవానుల ఆధ్వర్యంలో భారీ సెక్యురిటీ ఏర్పాట్లు చేశారు.
ప్రస్తుతం ఉన్న ఒక గార్డ్ స్థానం లో 1+1 గార్డ్ లను పెంచారు. అదే విధంగా 1+1 గన్ మెన్ల స్థానం లో 2+2 కి ప్రభుత్వం భద్రత పెంచింది. అలాగే భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఒక పోలీస్ అధికారిని కూడా నియమించారు. అదే విధంగా CRPF భద్రత కోసం ఇప్పటికే CRPF కేంద్ర కార్యాలయానికి డీజీపీ లేఖ రాసినట్లు విశ్వసనీయ సమాచారం. రమేష్ కుమార్ పేరుతో విడుదలైన లేఖపై ఎన్నికల కార్యాలయం నుండి ఇంకా స్పష్టత లభించలేదు. అయినా ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టి తక్షణమే భద్రతను పెంచారు.