35.2 C
Hyderabad
May 21, 2024 18: 02 PM
Slider కడప

ఒంటిమిట్ట చెరువు పై టీడీపీ రాష్ట్ర కార్యదర్శి భత్యాల సెల్ఫీ ఛాలెంజ్

#bhatyala

ఉమ్మడి కడప జిల్లా ఒంటిమిట్ట చెరువు దుస్థితిపై రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి బత్యాల చెంగల రాయుడు సోమవారం రాష్ట్ర ప్రభుత్వం కు సెల్ఫీ చాలెంజ్ విసిరారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్సీ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజంపేట నియోజకవర్గ ఇంచార్జ్ బత్యాల చంగల్ రాయుడు మాట్లాడుతూ రాష్ట్ర విభజనలో భాగంగా భద్రాచలం తెలంగాణకు వెళ్ళినప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి ఏకశిలా నగరము అయినటువంటి ఒంటిమిట్టను భద్రాదిగా గుర్తించి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తెలుగు దేశం ప్రభుత్వంలో ఆలయాన్ని రూ. 100 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశారన్నారు. ఇందులో భాగంగా సోమశిల వెనుక జలాల నుంచి ఒంటిమిట్ట చెరువుకు కోదండరామ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు నింపి భద్రాచలంలో మాదిరిగా ఎప్పుడూ యాత్రికులు బోటు షికారు చేసే విధంగా తీర్చిదిద్దాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఆరోజు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి చెరువు నిండా నీరు నింపి ఉత్సవాల సమయంలో భక్తుల కోసం బోట్లు కూడా ఏర్పాటు చేశారన్నారు.

అయితే వైసిపి వచ్చాక జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక కోదండరామ ఎత్తిపోతల పథకాన్ని పక్కన పెట్టేశారన్నారు.ఎప్పుడు చూసినా పైపులు పగిలి పోవడం మరమ్మత్తులు మోటార్లు మరమ్మత్తులు గురి కావడం తో అధికారులు ఆ పథకం నిర్వహణ నిర్వహణను గాలికి వదిలేశారని ఫలితంగా చెరువులో నీరు లేక  వెలవెల పోయిందని ఆరోపించారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఒంటిమిట్ట చెరువుకు కోదండరామ ఎత్తిపోతల పథకం ద్వారా నీరు నింపాలని ప్రభుత్వాన్ని ఆయన  డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

కాపురాల ఏర్పాటుపై దేశంలో ఎలాంటి నిషేధం లేదు

Satyam NEWS

కొల్లు రవీంద్రకు 14 రోజుల రిమాండ్‌

Satyam NEWS

పార్టీలకు అతీతంగా ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా

Satyam NEWS

Leave a Comment