29.7 C
Hyderabad
May 22, 2024 01: 42 AM
Slider ఆధ్యాత్మికం

20 నుండి 28 వరకు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు

#TTD

శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 20 నుండి 28వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 19వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభ‌మ‌వుతాయి. ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు ఏకాంతంగా వాహ‌న‌సేవ‌లు నిర్వ‌హిస్తారు.

బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :

తేదీ                                               ఉదయం                           సాయంత్రం

20-02-2022(ఆదివారం)                 ధ్వజారోహణం(మీన‌ల‌గ్నం)            పెద్దశేష వాహనం

21-02-2022(సోమ‌వారం)            చిన్నశేష వాహనం                     హంస వాహనం

22-02-2022(మంగ‌ళ‌వారం)            సింహ వాహనం                   ముత్యపుపందిరి వాహనం

23-02-2022(బుధ‌వారం)                కల్పవృక్ష వాహనం                 సర్వభూపాల వాహనం

24-02-2022(గురువారం)              పల్లకీ ఉత్సవం(మోహినీ అవతారం)   గరుడ వాహనం

25-02-2022(శుక్ర‌వారం)               హనుమంత వాహనం            స్వర్ణరథం(తిరుచ్చి), గజ వాహనం

26-02-2022(శ‌నివారం)                సూర్యప్రభ వాహనం                         చంద్రప్రభ వాహనం

27-02-2022(ఆదివారం)            రథోత్సవం(సర్వభూపాల వాహనం)           అశ్వవాహనం

28-02-2022(సోమ‌వారం)            చక్రస్నానం                                         ధ్వజావరోహణం

ఫిబ్రవరి 15న కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో ఫిబ్రవరి 15వ తేదీ మంగ‌ళ‌వారం  ఉదయం 6 నుండి 10 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జ‌రుగ‌నుంది. బ్రహ్మోత్సవాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ.

Related posts

దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ

Satyam NEWS

నేతల అరెస్టు: కొనసాగుతున్న తెలంగాణ బంద్

Satyam NEWS

వనపర్తి పోలీస్ ప్రజావాణిలో 7 ఫిర్యాదులు

Satyam NEWS

Leave a Comment