38.2 C
Hyderabad
May 2, 2024 19: 35 PM
Slider వరంగల్

దేశంలోనే అగ్రశ్రేణి రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ

#errabelli

అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయడంలో దేశంలోనే తెలంగాణ రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని, తెలంగాణ పండుగలకు సియం కేసీఆర్ ప్రపంచస్థాయి గుర్తింపు తెచ్చారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖామంత్రి  ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ జిల్లా రాయపర్తి ఎంపీడీఓ కార్యాలయం ప్రాంగణంలో మండలంలోని మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మహిళలు బతుకమ్మలతో మంత్రి  దయాకర్ రావుకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా  ఏర్పాటు చేసిన  సభ లో మంత్రి  మాట్లాడుతూ తెలంగాణ ప్రాంత సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ దేశంలోనే ఆదర్శంగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిలిచారని మంత్రి దయాకర్ రావు అన్నారు. బతుకమ్మ పండుగకు వచ్చే ప్రతి ఆడబిడ్డ సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వ ధ్యేయంగా ఆడపడుచులకు మేనమామ గా, అన్నాతమ్ముడుగా సియం కేసీఆర్ బతుకమ్మ కానుకగా చీరేలని అందిస్తున్నారని అన్నారు.

తెలంగాణ వ‌చ్చిన త‌ర్వాత దేశంలో ఎక్క‌డా లేని విధంగా ప్ర‌భుత్వ‌మే ప్ర‌జ‌ల‌ పండుగ‌ల‌ని నిర్వ‌హిస్తున్న‌దని అన్నారు. రూ. 333 కోట్ల ఖర్చుతో రాష్ట్రంలోని ప్రతి అక్క, చెల్లె, అమ్మకు చీరెలు పంపిణీ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పేదల పక్షపాతి అయిన మన ముఖ్యమంత్రి కరోనా కష్టకాలంలో అప్పు తెచ్చి, పేదలకు ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, రైతుబంధు ఇచ్చారన్నారు. ఎర్రబెల్లి ట్రస్ట్ తరఫున నియోజకవర్గంలో నిత్యావసర సరుకులు, మాస్కులు, సానిటైజర్లు పంపిణీచేసినట్లు, 50 లక్షలు ఖర్చు పెట్టి ఆనందయ్య మందు ఇంటింటికి అందజేసినట్లు ఆయన తెలిపారు.

ఆడబిడ్డల కష్టాలను చూసి 40 వేల కోట్లు ఖర్చుపెట్టి గోదావరి నీటిని శుద్దిచేసి ఇంటింటికి నల్లా ద్వారా సురక్షిత మంచినీరు  అందజేస్తున్న మహానుభావుడు కెసిఆర్ అని ఆయన కొనియాడారు. మహిళా గ్రూపులకు ఆర్థికంగా బలోపేతం చేయడానికి, పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేందుకు ఎన్ని కోట్లైనా.. ఋణాలు అందజేస్తామన్నారు.

పాలకుర్తి నియోజకవర్గంలో  రూ. 3 కోట్ల 61 లక్షల విలువైన 1 లక్ష 4వేల చీరేలను పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి గ్రామంలో స్మశానవాటికలు, పల్లె ప్రకృతి వనాలు, పచ్చదనంతో 2-3 సంవత్సరాలుగా ఎంతో మార్పుతో, గ్రామ స్వరాజ్యం కళ్ళకు కనపడుతుందన్నారు. తెలంగాణా సంస్కృతిలో భాగమైన బతుకమ్మను అందరూ సంబురంగా జరుపుకోవాలన్నారు.

అనంతరం  కలెక్టర్  గోపి మాట్లాడుతూ  మంత్రివర్యుల సహకారం  తో జిల్లా లోని 3, 37, 000 మంది  ఆడపడుచు లందరికి  చీరలను అందచేస్తామన్నారు. ఈ కార్యక్రమం  లో అదనపు  కలెక్టర్  హరి  సింగ్, డిఆర్ డివో ప్రాజెక్టు డైరక్టర్  సంపత్  రావు ప్రజాప్రతినిధులు  పాల్గొన్నారు.

Related posts

నీళ్లు లేక హనుమాన్ భక్తుల అవస్థలు

Satyam NEWS

నేపాల్లో జరిగిన కరాటే అండర్ 14 విభాగంలో సత్తా చాటిన సలోమి

Satyam NEWS

మేడారం జాతరకు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం

Satyam NEWS

Leave a Comment