34.2 C
Hyderabad
May 21, 2024 19: 16 PM
Slider ముఖ్యంశాలు

రెవిన్యూ గ్రామ సహాయకుల ఆందోళనకు తెలంగాణ జన సమితి మద్దతు

#telanganajanasamiti

హుజూర్ నగర్ నియోజకవర్గ, మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గత 5 రోజులుగా రెవిన్యూ గ్రామ సహాయకులు(విఆర్ఎ)చేస్తున్న నిరసన దీక్షలకు తెలంగాణ జన సమితి తన పూర్తి మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా తెలంగాణ జన సమితి నియోజకవర్గ ఇన్చార్జి దొంత రెడ్డి శ్రీనివాస్ రెడ్డి పాల్గొని దీక్షలను ప్రారంభించి మాట్లాడుతూ విఆర్ఎ ల సమస్యలు పరిష్కరిండంలో రాష్ట్ర ప్రభుత్వం,ముఖ్యమంత్రి కెసిఆర్ పూర్తిగా వైఫల్యం చెందాడని అన్నారు. గతంలో ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను, చేసిన వాగ్ధానాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

విఆర్ఎ లను పేస్కేల్ ఉద్యోగులుగా ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. సీనియారిటీ ప్రకారం అర్హత ఉన్నవారికి పదోన్నతి కల్పించాలని, వయస్సు 55 నిండిన ప్రతి విఆర్ఎ లకు పదవీ విరమణ విధానం అమలు చేయాలని,కారుణ్యనియామకాల విధానంలో వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. విఆర్ఓ లను తొలగించి విఆర్ఎ చేత వెట్టి చాకిరీ చేయిస్తున్నారని విమర్శించారు. రెవిన్యూ శాఖలో అవినీతి,అక్రమాలను అరికట్టడం చేతగాక విఆర్ఓ లను తొలగించి చేతులు దులుపుకుని,విఆర్ఎ లపై అధిక పనిభారం మోపారని అన్నారు.విఆర్ఎ ల న్యాయమైన సమస్యలు పరిష్కరించకుంటే వారు చేసే పోరాటానిక తెలంగాణ జన సమితి సంపూర్ణ మద్దతు ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జన సమితి జిల్లా ఉపాధ్యక్షులు ధీరావత్ చందు నాయక్,తెలంగాణ జన సమితి యూత్ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎస్.బిక్షం నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

కుట్టుమిషన్లు అందించిన వరల్డ్ ఆర్య వైశ్య మహిళా విభాగం

Satyam NEWS

స్థానిక ఎన్నికల తర్వాత అసెంబ్లీ ముట్టడి

Satyam NEWS

నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల(NEC) కి రీసెర్చ్ సెంటర్

Satyam NEWS

Leave a Comment