39.2 C
Hyderabad
May 4, 2024 22: 44 PM
Slider ప్రపంచం

రికార్డు స్థాయి ద్రవ్యోల్బణంలో చిక్కుకున్న అమెరికా

#bloomberg

కరోనా, రష్యా ఉక్రెయిన్ యుద్ధం తదితర కారణాలతో ప్రపంచంలోని చాలా దేశాలు ద్రవ్యోల్బణంలో కూరుకుపోతున్నాయి. తాజాగా అగ్ర రాజ్యం అయిన అమెరికా కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నది. చాలా దేశాల ఎగుమతులు, దిగుమతులపై ఈ పరిస్థితులు తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ఇది వస్తు సామాగ్రి సరఫరాపై పెను ప్రభావం పడేలా చేసింది.

ప్రముఖ టివి ఛానెల్ బ్లూమ్ బర్గ్ చేసిన ఆర్ధిక విశ్లేషణ ప్రకారం ప్రపంచంలోని చాలా దేశాలు రాబోయే అతి కొద్ది కాలంలోనే ఆర్ధిక మాంద్యంలో చిక్కుకోబోతున్నాయి. ఆర్థిక మాంద్యం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఆందోళనకు గురిచేస్తున్న వేళ బ్లూమ్‌బెర్గ్ ఇందుకు సంబంధించి ఈ సర్వే నివేదికను విడుదల చేసింది. బ్లూమ్‌బెర్గ్ భారతదేశంతో సహా చాలా దేశాలలో మాంద్యం చూపిస్తున్న ప్రభావాన్ని ప్రకటించింది.

బ్లూమ్ బెర్గ్ జరిపిన సర్వేలో భారత్‌లో ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం సున్నా శాతం మాత్రమే ఉందని తేలింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రికార్డు స్థాయిలో కనిష్ట స్థాయికి చేరుకుంటున్న తరుణంలో ఈ నివేదిక రావడం ఆసక్తికరం. రూపాయి విలువ పడిపోతున్నప్పటికీ, వివిధ దశల్లో రెపో రేటును పెంచడం ద్వారా ఆర్‌బిఐ ఆర్థిక వ్యవస్థను నిలువరించగలదని అంచనా.

బ్లూమ్ బర్గ్ ఆర్థికవేత్తల సర్వే ప్రకారం, భారతదేశంలో మాంద్యం ఏర్పడే అవకాశాలు ప్రస్తుతానికి చాలా తక్కువగా ఉన్నాయి. అయితే మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికాలో పరిస్థితి అంత మెరుగ్గా లేదని నివేదించారు. యూఎస్‌లో 40 శాతం ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

అమెరికాలో ద్రవ్యోల్బణం 8.6 శాతానికి పెరగడంతో ఆర్థిక మాంద్యం భయాలు ఆర్థిక వ్యవస్థకు వ్యాపించాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం 40 ఏళ్ల గరిష్ట స్థాయికి చేరుకుంది. అయితే అమెరికాలో ఆర్థిక మందగమనం భారతీయ ఐటీ కంపెనీలపై ప్రభావం చూపుతుంది.

TCS, HCL, Infosys వంటి కంపెనీలు US మార్కెట్ నుండి తమ ఆదాయంలో 40 శాతం వాటాను కలిగి ఉన్నాయి. అమెరికా మాంద్యంలోకి పడిపోతే ఈ కంపెనీల ఆదాయాలు పడిపోతాయని వార్తలు వస్తున్నాయి. ఇది ఐటీ రంగాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

Related posts

వైరల్: సీనియర్ హీరో అర్జున్ మెసేజికి అద్భుత స్పందన

Satyam NEWS

చలో హైదరాబాద్ కు కదిలిన కార్మిక సైన్యం

Satyam NEWS

లాహోర్‌లో పేలిన బాయిలర్.. ముగ్గురు మృతి..

Sub Editor

Leave a Comment