24.7 C
Hyderabad
May 13, 2024 06: 48 AM
Slider ప్రత్యేకం

నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల(NEC) కి రీసెర్చ్ సెంటర్

#JNTUC

ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో ఇంజనీరింగ్ విద్య లో టాప్ 10 కళాశాలలో ఒకటైన నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాలకు పీహెచ్డీ రీసెర్చ్ సెంటర్ కు అనుమతి మంజూరు అయింది. కాకినాడ జేఎన్టీయూ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ డాక్టర్ ప్రసాద్ రాజ్ చేతుల మీదగా అనుమతి పత్రాన్ని నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మిట్టపల్లి రమేష్ అందుకున్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్  డాక్టర్ ఎం శ్రీనివాస కుమార్ మాట్లాడుతూ పిహెచ్డి స్కాలర్స్ చేసేవారు ఎవరైనా జేఎన్టీయూ కాకినాడ యూనివర్సిటీకి వెళ్లే పనిలేకుండా నరసరావుపేట ఇంజనీరింగ్ కళాశాల నందు తమ పిహెచ్డి చేయవచ్చని తెలిపారు.

పూర్తి వివరాలకు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని ఆయన పేర్కొన్నారు. గురువారం జేఎన్టీయూ యూనివర్సిటీ కాకినాడ వైస్ ఛాన్స్లర్ వారి కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో యూనివర్సిటీ రెక్టర్, రిజిస్టర్, మరియు పిహెచ్డి విభాగం డైరెక్టర్ల సమక్షంలో రీసెర్చ్ సెంటర్ మంజూరు పత్రాన్ని అందుకోవడం జరిగిందని కార్యదర్శి మిట్టపల్లి రమేష్ తెలిపారు.

Related posts

మైనాస్వామికి అరుదైన గుర్తింపు

Satyam NEWS

గడువు లోగా అనుమతులు ఇవ్వాలి

Bhavani

బండి ఆరోప‌ణ‌లు అవాస్త‌వం

Sub Editor

Leave a Comment