29.2 C
Hyderabad
May 10, 2024 23: 53 PM
Slider నల్గొండ

మూడో వార్డులో డి ఎమ్ ఎఫ్ టి నిధులతో అభివృద్ధి పనులు

#hujurnagar

సి సి రోడ్డు నిర్మాణ పనులు పరిశీలించిన వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో డి ఎమ్ ఎఫ్ టి నిధులతో సుమారు 70 లక్షల రూపాయలతో 3వ,వార్డు లోని వీధులలో సిసి నిర్మాణాలు జరిగాయని,వాటిలో మిగిలిన 3 లక్షల రూపాయల నిధులని 90 మీటర్ల సిసి రోడ్డు నిర్మాణాన్ని, కూరగాయల సైదిరెడ్డి ఇంటి నుండి పూర్ణచంద్రరావు ఇంటి వరకు పనులు జరుపుతున్నట్లు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి తెలిపారు.గతంలో నిర్మించిన సిసి రోడ్ల కి ఇరువైపులా మట్టిని నింపాల్సిన బాధ్యత కాంట్రాక్టర్ దే అని,ఇప్పటి వరకు అట్టి మట్టిని నింపకపోవడంతో సిసి రోడ్లు అనేకచోట్ల  దెబ్బతింటున్నయని ఇట్టి విషయాన్ని సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేస్తానని అన్నారు.

రోడ్ల నిర్మాణంలో కూడా నాణ్యత పాటించాలని కాంట్రాక్టర్లను కోరినట్లు కోతి సంపత్ రెడ్డి తెలిపారు.2018 లో అప్పటి హుజూర్ నగర్ శాసనసభ్యుడు గా ఉన్న నలమాల ఉత్తంకుమార్ రెడ్డి ప్రతిపాదనల తో డి ఎమ్ ఎఫ్ టి నిధులు మంజూరు అయ్యాయని,వాటి ప్రొసీడింగ్ లని మార్చి మున్సిపాలిటీలలో జరగవలసిన పనులను పంచాయతీరాజ్ కు కేటాయించారని,ఆ పనులే నేటి వరకు పట్టణంలో పలు వార్డులలో జరుగుతున్నాయని సంపత్ రెడ్డి వారు గుర్తు చేశారు.

ప్రతిపక్ష కౌన్సిలర్లుగా ప్రజల ఆస్తులను, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా ప్రజల పక్షాన మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అక్రమాలకు,అన్యాయాలని ప్రశ్నిస్తూ ఆధారాలతో బయటపెడుతున్న పరిస్థితుల్ని జీర్ణించుకోలేక పోతున్నారని అన్నారు.

ప్రస్తుతం వారికున్న అధికార బలంతో డి ఎమ్ ఎఫ్ టి నిధులలో మూడవ వార్డుకి కేటాయించిన 5 లక్షల రూపాయల పనులతో పాటు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని వార్డుల్లో,23వ, వార్డులో కూడా ఎటువంటి మున్సిపల్ సమావేశం నిర్వహించకుండా కౌన్సిల్ తీర్మానం లేకుండా అధికార పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకులు వార్డు కేటాయించిన నిధులను తొలగించారని తెలిపారు.

ఈ విషయాన్ని న్యాయస్థానాల ద్వారా తిరిగి వార్డులోనే నిర్మాణాలు జరిపేలా పోరాటం ఉంటుందని,తమ వార్డుల్లో జరగాల్సిన అభివృద్ధి పనులను తిరిగి ఎలా తెచ్చుకోవాలో అభివృద్ధిని ఎలా చేసుకోవాలో తమకు తెలుసునని సంపత్ రెడ్డి అన్నారు.ఇలా కేటాయించిన నిధులను తొలగించి బెదిరింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు భయపడేది లేదని వారు అన్నారు.

త్వరలోనే నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు నల్లమాద ఉత్తంకుమార్ రెడ్డి ఎంపి నిధులలో కేటాయించిన నిధులతో వార్డుని మరింత అభివృద్ధిలో ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికలు సిద్ధం చేయబడ్డాయని కోతి సంపత్ రెడ్డి తెలిపారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

కరోనా వ్యాధి వైరస్ వ్యాప్తి నివారణకు సత్వర చర్యలు

Satyam NEWS

రామప్ప గైడ్ లు, అర్చకులకు బీసీ సంక్షేమ సంఘం సన్మానం

Satyam NEWS

బి‌సి భవన్ త్వరగా పూర్తి చేయాలి

Murali Krishna

Leave a Comment