25.7 C
Hyderabad
May 22, 2024 07: 57 AM
Slider విజయనగరం

ఆ ప్రభుత్వం నెలకొల్పింది..ఈ ప్రభుత్వం ఆధునీకరించింది..!

#mlakolagatla

నగరంలో స్విమ్మింగ్ పూల్ ప్రారంభోత్సవం లో స్థానిక ఎమ్మెల్యే వ్యాఖ్యలు

విజయనగరంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో ఉన్న ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లోని ఈత కొలను (స్విమ్మింగ్ పూల్)ను ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి పునః ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో గత కొంతకాలం పాటు ఈతకొలనును నిలిపివేశారు. దీంతో క్రీడాకారులు కోరిక మేరకు మరల ఆరు లక్షల రూపాయలు వెచ్చించి అన్ని సదుపాయాలను కల్పించి, ఈత కొలను ప్రారంభానికి అధికారులు సిద్ధం చేశారు.

ఆదివారం ఈ మేరకు శాసన సభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ కు చేరుకొని ఈతకొలను ప్రారంభించి క్రీడాకారులను అభినందించారు. అలాగే ఈ మధ్య కాలంలో వివిధ జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన క్రీడాకారులకు పథకాలను అందజేసి ప్రోత్సహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  కోవిడ్ నేపథ్యంలో మూతపడ్డ స్విమ్మింగ్ పూల్ ను మరల ప్రారంభించి క్రీడాకారులకు అందుబాటులోకి తేవడం సంతోషంగా ఉందన్నారు. ఇక్కడ అనేక మంది స్విమ్మింగ్ క్రీడాకారులు చక్కటి తర్ఫీదు పొంది జిల్లా రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించడం అభినందనీయమన్నారు. చక్కటి ప్రతిభను కనబరుస్తున్న క్రీడాకారులు జిల్లా ఖ్యాతిని ఇనుమడింప చేస్తున్నారన్నారు.

వారిని మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ఆరు లక్షల రూపాయలు వెచ్చించి మూతపడ్డ ఈత కొలను వినియోగంలోకి తీసుకు వచ్చామన్నారు. 2003లో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈత కొలను లో ఇంత వరకు అనేక మంది క్రీడాకారులకు, అధికారులు చక్కటి తర్ఫీదునిచ్చారన్నారు. సుశిక్షితులైన క్రీడాకారులు జిల్లా రాష్ట్ర స్థాయిలో పోటీలలో పాల్గొని పథకాలను సాధించారన్నారు. 

క్రీడాకారులకు చక్కటి ప్రోత్సాహం అవకాశాన్ని అందించినట్లయితే వారి ప్రతిభను సంపూర్ణంగా కనబరిచి చక్కటి ఫలితాలు తీసుకొస్తారన్న నమ్మకం ఏర్పడిందన్నారు. రానున్న రోజుల్లో ఏ క్రీడలో ఆసక్తి కర పరిస్తే ఆ అంశాలలో చక్కటి తర్ఫీదు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.

అన్ని రంగాలతో పాటు జిల్లాలో క్రీడా రంగాన్ని కూడా అభివృద్ధి చేసేందుకు కృతనిశ్చయంతో ఉన్నామన్నారు. ఇప్పటికే ఇండోర్ స్టేడియం,విజ్జీ స్టేడియం, రాజీవ్ స్టేడియం వంటి క్రీడా ప్రాంగణాల తో పాటు పురాతనమైన కోడి రామ్మూర్తి వ్యాయామశాల, ఆక్వా స్పోర్ట్స్ కాంప్లెక్స్ వంటి అనేక క్రీడా ప్రాంగణాలు అందుబాటులో ఉన్నాయన్నారు.

అదేవిధంగా నగర నడిబొడ్డులో ఉన్న ప్రకాశం పార్క్ లో కోటి రూపాయలు వెచ్చించి,చక్కగా తీర్చిదిద్దామన్నారు. ప్రజల ఆరోగ్య పరిపుష్టికై క్రీడా ప్రోత్సాహానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు శివ ధనలక్ష్మి, పట్నాన పైడ్రాజు, క్రీడా ప్రాధికార సంస్థ అధికారి దేవానందం, చీఫ్ కోచ్ వెంకటేశ్వరరావు,స్విమ్మింగ్ కోచ్ అప్పలనాయుడు, క్రీడాకారుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

లఖీమ్ పూర్ ఖేరి ఘటనపై నివేదిక ఇవ్వాలన్న సుప్రీంకోర్టు

Sub Editor

తెలంగాణ విమోచన దినోత్సవం రోజున రాష్ట్రానికి కేంద్ర హోం మంత్రి రాక…!

Satyam NEWS

జాతీయ స్థాయిలో చొప్పదండి పీఏసీఎస్ కి మూడో సారి అవార్డు

Satyam NEWS

Leave a Comment