32.2 C
Hyderabad
May 13, 2024 19: 42 PM
Slider జాతీయం

సమ్మక్క సారలమ్మ జాతరకు రెండున్నర కోట్లు విడుదల చేసిన కేంద్రం

#kishanreddy

సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను నిర్వహించటం కోసం కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ, పర్యాటక మంత్రిత్వ శాఖల ద్వారా రు.2.5 కోట్లు నిధులను విడుదల చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందనికేంద్ర సాంస్కృతిక, పర్యా టక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి జి కిషన్ రెడ్డి ప్రకటించారు. సమ్మక్క సారలమ్మ జాతర అతిపెద్ద గిరిజన జాతర, ఇది ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది.

ఇది గిరిజన ప్రజలు పెద్ద మొత్తంలో హాజరై జరుపుకునే అతిపెద్ద పండుగలలో ఒకటి. తెలంగాణలో గిరిజనులు అత్యధిక సంఖ్యలో నివశించే ములుగు జిల్లాలోని మేడారం గ్రామం నందు, ఈ ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19వ తేదీ వరకు ఈ పండుగ అత్యంత వైభవంగా జరుగనుంది.

గిరిజన సంస్కృతి, వారసత్వా న్ని ప్రోత్సహించడంలో కేంద్రప్రభుత్వం పాత్రను కేంద్రమంత్రి నొక్కి చెబుతూ, “ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలోని భారత ప్రభుత్వం గిరిజన ప్రజల ప్రత్యేక సంస్కృతి, వారసత్వా న్ని ఎంతగానో గౌరవిస్తుంది. సమ్మక్క సారలమ్మ మేడారం జాతరను నిర్వహించటం కోసం ఈ నిధులను కేంద్రం విడుదల చేసింది. అంతేకాకుండా, 2014 నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకునే వివిధ పండుగల కోసం DPPH (Domestic Promotion and Publicity including Hospitality) పథకం క్రింద రు. 2.45 కోట్లను మంజూరు చేసిందని తెలియజేశారు”.

ఈ నిధులను మేడారం నందు చిలకల గుట్ట చుట్టూ సంప్రదాయ రీతిలో 500 మీటర్ల కాంపౌండ్ గోడను నిర్మించటానికి, దానికి అనుసంధానంగా 900 మీటర్ల మెష్ ను ఏర్పా టు చేయటానికి, గోడల మీద గిరిజన సంస్కృతిని ప్రతిబింబించేలా అద్భుతమైన చిత్రాలను వేయటానికి, గిరిజన మ్యూజియంలో డిజిటల్ సమాచార కేంద్రాలు ఏర్పాటు చేయటానికి, గిరిజన మ్యూజియం పరిసరాలలో కోయ గ్రామాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టడానికి, ఐలాపూర్ సమ్మక్క జాతర, చిరుమల్ల సమ్మక్క జాతర, సాదలమ్మ తిరుణాల వంటి అనేక పండుగలు,వాటి విశిష్టత మీద పరిశోధనలు చేయడానికి, ఫోటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ, పెయింటింగ్ వంటి పోటీలను, సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటానికి, కోయ డ్యాన్స ట్రూప్, కొమ్ము కోయ, రేలా డ్యాన్స ట్రూప్స, పెయింటింగ్ వంటి వాటిని చిన్నతరహా పరిశ్రమలుగా గుర్తించి వాటికి ఆర్థిక మద్దతు అందించటానికి ఇలా అనేక రకాల కార్యక్రమాలకు ఉపయోగించటం జరుగుతుందని అన్నారు.

స్వదేశ్ దర్శన్ పథకం క్రింద, పర్యాటక మంత్రిత్వ శాఖ గిరిజన సర్క్యూ ట్ల అభివృద్ధిలో భాగంగా 2016-17 లోనే దాదాపు 80 కోట్ల రూపాయలతో ములుగు – లక్నవరం -మేడవరం -తాడ్వాయి – దామరవి – మల్లూర్ – బోగత జలపాతాలలో సమగ్ర అభివృద్ధిని చేపట్టామన్నారు.

అందులో భాగంగా మేడారంలో అతిథి గృహాన్ని , ఓపెన్ ఆడిటోరియం, పర్యాటకుల కోసం విడిది గృహాలు, త్రాగునీరు వంటి వివిధ సౌకర్యాలు, సోలార్ లైట్లు వంటి వాటిని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. “దేశం ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను జరుపుకుంటున్న ప్రస్తుతతరుణంలో, భారత ప్రభుత్వం 75 సంవత్సరాల ప్రగతిశీల భారతదేశాన్ని దేశంలోని వివిధ వర్గాల ప్రజలు, వారి సంస్కృతులు మరియు విజయాల అద్భుతమైన చరిత్రను స్మరించుకుంటుంది” అని అన్నా రు.

గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా జయంతిని ఇటీవలే మనం ‘జనజాతీయ గౌరవ్ దివస్’ గా జరుపుకున్నా మని అన్నా రు. మన స్వాతంత్య్ర సంగ్రామంలో అనేక పోరాటాలు సాగించి ఇప్పటి వరకు ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్న ప్రముఖ ఆదివాసీ స్వాతంత్య్ర సమరయోధులు కొమరం భీమ్, రామ్జీ గోండ్, అల్లూరి సీతారామరాజు వంటి వారి పోరాటాలను బాహ్య ప్రపంచానికి తెలియజేయడానికి దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నా మని అన్నారు.

మన స్వాతంత్య్ర ఉద్యమంలో సుమారు 85 తిరుగుబాట్లలో పాల్గొన్న గిరిజన స్వాతంత్య్ర సమరయోధులకు గుర్తింపునిచ్చేందుకు దేశవ్యాప్తంగా 10 గిరిజన మ్యూజియంలను నిర్మిస్తున్నా మని అన్నారు. ఇందులో తెలంగాణలో నిర్మిస్తున్న రామ్ జి గోండ్ గిరిజన మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లో నిర్మిస్తున్న అల్లూరి సీతారామరాజు మ్యూజియం కూడా ఉన్నాయని, ఈ రెండు మ్యూజియంలకు ఒక్కొక్క దానికి నిర్మాణం కోసం కేంద్రప్రభుత్వం 15 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని అన్నా రు.

ఇవి బ్రిటిష్ వారి అణచివేత పాలనకు వ్యతిరేకంగా పోరాడిన మన వీరోచిత గిరిజన యోధుల పోరాటాలను ప్రదర్శి స్తాయని తెలియజేశారు”.2021-22 ఆర్థిక సంవత్సరంలో గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం రూ.7,524.87 కోట్ల బడ్జెట్ ను కేటాయిస్తే, 2022-2023 ఆర్థిక సంవత్సరానికిగాను గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం బడ్జెట్ ను గణనీయంగా పెంచి రూ. 8,451.92 కోట్లను కేటాయించింది.

“గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే, ఈ ఆర్థిక సంవత్సరం గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ కోసం కేటాయించిన బడ్జెట్ 12.32% పెరుగుదల” ను తెలియజేస్తుందని కేంద్ర మంత్రి తెలియజేశారు. యుపిఎ పాలనలో గిరిజన సమాజానికి కేటాయించిన బడ్జెట్ కేటాయింపులలోని అసమతుల్యతను ప్రభుత్వం సరి చేస్తోందని అన్నారు. ఇది రాజకీయ కోణంలో కాకుండా, గిరిజన సమాజంలోని యువతకు ఆర్థిక పురోగతి, మెరుగైన అభివృద్ధి అవకాశాలను అందించాలనే నిబద్ధతను ప్రతిబింబిస్తుంది.

ఈ విషయంలో మా ప్రభుత్వం 2022-2023 బడ్జెట్ అంచనాలలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ గిరిజన విశ్వవిద్యాలయాలకు రూ.44 కోట్లు కేటాయించింది. సంవత్సరాల తరబడి ఎటువంటి గుర్తింపు లేకుండా ఉన్న గిరిజన ప్రజలు అందించిన సహకారాన్ని గుర్తించి, వారికి సరైన గుర్తింపును అందించేలా చేయటానికి కేంద్రప్రభుత్వం కట్టుబడి ఉందని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా జనాభాలో దాదాపు 10% ఉన్న 705 గిరిజన జాతుల వారసత్వం, సంస్కృతి, విలువలను పరిరక్షించటానికి కట్టుబడి ఉన్నాము.

కేంద్రప్రభుత్వం నుండి విడుదల అయిన ఈ మొత్తం, ప్రస్తుతం ఉన్న కరోనా మహమ్మారి సమయంలో పండుగ కోసం  సమర్థవంతమైన  సన్నాహాలను ఏర్పాటు చేసుకోవటానికి ఉపకరిస్తుందని మరియు జాతీయ స్థాయిలో గిరిజనులకు ఒక విశిష్టమైన గుర్తింపును తీసుకువస్తుందని ఆయన అన్నారు.

Related posts

చిరు ధాన్యాల ఆహారం శ్రేష్టం

Murali Krishna

చర్లపల్లి ఈసీ నగర్‌ లో ఈసీఐఎల్‌ సొసైటి స్థలం కబ్జాకి యత్నం

Satyam NEWS

నేటి సమాజంలో మహిళలు అన్ని రంగాల్లోనూ రాణించాలి

Satyam NEWS

Leave a Comment