29.7 C
Hyderabad
May 7, 2024 06: 02 AM
Slider ప్రత్యేకం

జాతీయ స్థాయిలో చొప్పదండి పీఏసీఎస్ కి మూడో సారి అవార్డు

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చొప్పదండి కి 2019- 20 సంవత్సరానికి గాను జాతీయ స్థాయిలో NAFSCOB 3వఅవార్డు రావడం అభినందనీయమని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

చొప్పదండి సహకారసంఘానికి జాతీయ స్థాయి అవార్డు రావడంతో చొప్పదండి సహకార సంఘం పాలకవర్గ సభ్యులను హైదరాబాద్ లోని మంత్రుల నివాససముదాయంలో మంత్రి నిరంజన్ రెడ్డి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మట్లాడుతూ చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం రైతులకు చేస్తున్న సేవలను గుర్తించి జాతీయ స్థాయిలో 3వ స్థానంలో అవార్డు రావడం అభినందనీయం అన్నారు.

చొప్పదండి ప్రాథమిక సహకార సంఘాన్ని ఇతర సంఘాలు ఆదర్శంగా తీసుకోవాలని, సహకార స్ఫూర్తిని పెంచాలని సూచించారు.

సంఘం ఏర్పాటు చేసినప్పటినుండి రైతులకు చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం అన్ని సంఘాలకు ఆదర్శంగా ఉన్నదని, రైతులకు ఉత్తమసేవలు అందిస్తుందని అన్నారు. సంఘం అభివృద్ధి కొరకు గత పాలక వర్గం, ఇప్పటి పాలక వర్గ కృషి తోనే సంఘం అభివృద్ధి చెందుతుందని అభినందించారు.

ఇతర సంఘాలలో ఎక్కడా లేని విధంగా చొప్పదండి ప్రాథమిక సహకార సంఘం సంఘ సభ్యులకు ప్రమాధభీమా, కుటుంబం లోని ఆర్థిక వెనుకబడిన విద్యార్థులకు రూ.5 వేల చొప్పున ఆర్థిక సహాయం అందజేయడం హర్షంనీయమని అన్నారు.

ఇదే స్పూర్తితో రైతులకు మరిన్నీ సేవలందించి వచ్చే సంవత్సరం మొదటి స్థానంలో నిలిపేందుకు పాలక వర్గం కృషి చేయాలని కోరారు. ఈనెల 22న చత్తీస్గడ్ రాష్ట్రం రాయపూర్ నందు నేషనల్ కాన్ఫరెన్స్ లో భాగంగా దీందయాల్ ఉపాధ్యాయ ఆడిటోరియం లో అవార్డు అందుకోనున్నారు.

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చొప్పదండి కి ఇదివరకే 2017-18 వ సంవత్సరంలో ఒకసారి మరియు 2018-19 వ సంవత్సరంలో రెండవసారి మరియు ప్రస్తుతం 2019-20 సంవత్సరానికి గాను మూడవసారి తృతీయ బహుమతి కింద NAFSCOB అవార్డు అందనున్నదని అన్నారు.

అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి, పాలకవర్గ సభ్యులకు అవార్డు వరించనున్నందున హర్షం వ్యక్తం చేశారు. ఇదంతా సంఘ సభ్యులు, సిబ్బంది నిర్విరామ కృషి , పాలకవర్గ సహాయం తో ఇది సాధ్యపడిందని తెలిపారు.

అనంతరం సంఘం అధ్యక్షుడు వెల్మ మల్లారెడ్డి,సీఈవో కళ్ళెం తిరుపతి రెడ్డి, సంఘం డైరెక్టర్లను మంత్రి నిరంజన్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ లు ఘనంగా సన్మానించారు. వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు పాల్గొన్నారు.

95 వేల సొసైటీ లలో ఉత్తమ పనితీరు

దేశంలోని 95 వేలు, రాష్ట్రంలో 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలలో కరీంనగర్ జిల్లా చొప్పదండి సహకార సంఘానికీ వరుసగా మూడోసారి ద్వారా బెస్ట్ పర్ఫార్మెన్స్ అవార్డు రావడం జరిగింది ఈ అవార్డు ఈ సంఘానికి రావడం ఇది వరుసగా మూడోసారి, సొసైటీ పరిధిలోని తొమ్మిది గ్రామాలలో ప్రతి గ్రామంలో సొసైటీ సొంత నిధులతో గోదాములు నిర్మించడం జరిగింది

ఈ గోదాముల ద్వారా రైతులకు తమ గ్రామంలోని ఎరువులు తీసుకునే సౌకర్యం కలిగింది. సొసైటీ టర్నోవర్ 150 కోట్లు ఉంది. ఈ సంవత్సరం నికర లాభం 152 లక్షలు. గత 5 సంవత్సరాల నుండి రైతులకు తమ వాటాధనం పై 10 శాతం డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. సొసైటీ నుండి నిరుపేద విద్యార్థులకు వారి చదువు నిమిత్తం 13 మందికి 65000 ఆర్థిక సహాయం అందిస్తున్నారు.

Related posts

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎసిబి 14400 కాల్ సర్వీసుల బోర్డు ఏర్పాటు చేయాలి

Satyam NEWS

పోలీసులు ఆపారని స్కూటీ కి నిప్పు

Bhavani

నాణ్యమైన ఔషదాలను ప్రజలకు అందించాలి

Satyam NEWS

Leave a Comment