29.7 C
Hyderabad
May 1, 2024 06: 01 AM
Slider రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లాలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన

#uppalacharitabletrust

పెద్దూరు తండ గ్రామంలో వివిధ అభివృద్ధి పనులకు జడ్పిటిసి ఉప్పల వెంకటేష్ శంకుస్థాపన నిర్వహించారు. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం పెద్దూరు తాండ గ్రామంలో  ఆదివారం మండల పరిషత్  10 లక్షల నిధులతో విశాల అదనపు గది జిల్లా పరిషత్ నిధుల ద్వారా అంగన్వాడి భవన నిర్మాణాలకు శంకుస్థాపన నిర్వహించారు. అదేవిధంగా ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా నిర్మాణం చేపట్టిన మంచి నీటి శుద్ధి కేంద్రాన్ని ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఉప్పల వెంకటేష్ ప్రారంభోత్సవం చేశారు. ఈ కార్యక్రమంలో  పెద్దూరు తండా సర్పంచ్ చక్రి కిషన్ వైస్ ఎంపీపీ శ్రీనివాస్ రెడ్డి మండల సర్పంచుల సంఘం అధ్యక్షుడు గోపాల్ నాయక్ సర్పంచ్ లలిత రఘుపతి రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఎంతో విలువైన స్థలం కారుచౌకగా లీజుకు….

Bhavani

ప్ర‌తినెలా మూడో శ‌నివారం ఔత్సాహిక పారిశ్రామిక‌వేత్త‌ల‌తో భేటీ

Satyam NEWS

ప్రొసీడింగ్స్ కు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నఅధికారులు

Satyam NEWS

Leave a Comment