32.2 C
Hyderabad
May 21, 2024 13: 00 PM
Slider ముఖ్యంశాలు

వైసీపీలో వర్గపోరు: ఎంపీ బోస్ వర్గీయుడిపై మంత్రి మనుషుల దాడి

#groupclash

తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురం నియోజకవర్గంలో మంత్రి వేణు వర్సెస్ ఎంపీ బోస్ వ్యవహారం ముదిరింది. మంత్రి వేణు సమక్షంలో బోస్ వర్గీయుడు అయిన మున్సిపల్ వైస్ చైర్మన్ శివాజీపై మంత్రి ప్రధాన అనుచరుడు ఉదయ్ చేయి చేసుకున్నాడు. మంత్రి వేణు పక్కనే ఉండగానే ఈ ఘటన జరిగింది. ఆదివారం మంత్రి వేణుకు వ్యతిరేకంగా బోస్ వర్గీయుల సమావేశం జరిగింది. రానున్న ఎన్నికల్లో వేణుకు టికెట్ ఇవ్వకుండా అడ్డుకోవాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారు. మంత్రి వేణు అవినీతి అనకొండ అని బోస్ వర్గీయులు తీర్మానించారు.

సోమవారం బోస్ వర్గీయుడు శివాజీ వైస్ చైర్మన్ హోదాలో జగనన్న సురక్ష కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో శివాజీని మంత్రి వేణు అనుచరుడు మంత్రి వేణు అనుచరుడు ఉదయ్‌ దాడి చేయడం జరిగింది. దీంతో మనస్తాపం చెందిన శివాజీ చీమల మందు తాగాడు. చికిత్స నిమిత్తం అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన కోనసీమలో కల కలం సృష్టించింది. రామచంద్రపురం నియోజకవర్గ వైకాపా కార్యకర్తల ఆత్మీయ సమావేశం పేరుతో ఆదివారం వేణు వ్యతిరేక వర్గీయులు ఆదివారం ఆత్మీయ సభ నిర్వహించిన సంగతి తెలిసిందే.

సభలో కార్యకర్తలు ఒక్కొక్కరుగా మంత్రి వేణుపై విమర్శలు గుప్పించారు. రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్‌చంద్రబోస్‌ తనయుడు సూర్యప్రకాష్‌కు కాకుండా వేణుకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తే ఆయనను ఓడించి తీరతామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నెల 26న అమలాపురంలో జరిగే సభకు రానున్న ముఖ్యమంత్రిని కలిసి ఇక్కడ చేసిన తీర్మానంపై ఆయనకు వివరిస్తామని నాయకులు పేర్కొన్నారు. దీంతో వివాదం మరింత పెరిగి వుభయ వర్గాలు పరస్పరం దాడులకు దిగే పరిస్తితి నెలకొంది.

Related posts

పూజా ట్రావెల్స్ బస్సుకు తప్పిన ప్రమాదం

Bhavani

బీసీలకు అన్యాయం చేసిన వైసిపిని తిరస్కరించాలి

Satyam NEWS

పనులలో జాప్యం పై ఆగ్రహం

Bhavani

Leave a Comment