29.7 C
Hyderabad
May 2, 2024 06: 02 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి మున్సిపాలిటీలో  పరిపాలన విఫలం

#wanaparthy

వనపర్తి మునిసిపల్ కార్యాలయంలో  పరిపాలన విఫలమైంది. అధికారుల నిర్లక్ష్యం, వివిధ సెక్షన్లలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులకు పరిష్కారం లేదు. సమీక్ష చేయడంలో అధికారులు, ప్రజాప్రతినిధులు విఫలమయ్యారు. నల్లా కనెక్షన్లకు సంబదించిన పేరు మార్పిడి(మ్యూటేషన్) కోసం దరఖాస్తు ఇచ్చిన నెలలు, సంవత్సరం అయినా పేరు మారదు. పేరు మార్పిడి గురించి అడిగితె ఆన్ లైన్, సర్వర్ సమస్య ఉందని చెప్పి తప్పించుకోవడం అధికారులకు అలవాటు. కెసిఆర్, కేటీఆర్ వల్ల భవనాల రిజిస్ట్రేషన్ పూర్తి అయిన వెంటనే పేరు (మ్యూటేషన్) మార్పిడి అవుతుంది. అదే విదంగా భూములు రిజిస్ట్రేషన్ అయిన వెంటనే పట్టా మార్పిడి అవుతుంది. గతంలో భూమి, భవనం రిజిస్ట్రేషన్ అయినా కాని పేరు మార్పిడి దరఖాస్తు ఇచ్చినా సంవత్సరాలు అయినా పేరు మారదు. కార్యాలయాల్లో లంచం ఇవ్వాలి, బ్రోకర్లను సంప్రదించి లంచం ఇస్తే పేరు మార్పిడి చేయడం అలవాటు. మునిసిపల్ కార్యాలయంలో తనిఖీ చేసి పెండింగులో ఉన్న దరఖాస్తులపై, నల్లా కనెక్షన్ పేరు మార్పిడిపై చర్యలు తీసుకోవాలని భాదితులు కోరుతున్నారు. ఇలాంటి సమస్యలపై ప్రశ్నిస్తే నేరంగా భావిస్తారు. జిల్లాలో తహసీల్దార్, మండల పరిషత్ కార్యాలయాలను తనిఖీ చేయడంలో అధికారులు విఫలం.వనపర్తిలో బలం, పలుకుబడి ఉన్న వారు రోడ్ల ప్రక్కన కాల్వపై రాత్రికి రాత్రి డబ్బా వేసినా అడగరు. పేదలు డబ్బా వేసినా, బండి పెడితే తొలగించడం సాంప్రదాయంగా ఉంది.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

నిబంధనలకు విరుద్ధంగా కేటీఆర్ కు దర్శనం

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు అభినందల మాల

Satyam NEWS

వచ్చే నెల 10న ములుగులో లోక్ అదాలత్

Satyam NEWS

Leave a Comment