28.7 C
Hyderabad
May 6, 2024 07: 23 AM
Slider ఖమ్మం

పనులలో జాప్యం పై ఆగ్రహం

#Dr. Priyanka

ఎస్ సి ఏ నిధులతో చేపట్టిన పనులతో చేపట్టిన పనులలో జాప్యం జరగడం పట్లలో కొత్తగూడెం జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐడిఓసి కార్యాలయపు మిని సమావేశపు హాలులో 2020-21, 2021-22, 2022-23 మూడు సంవత్సరాల్లో చేపట్టిన పనుల ప్రగతిపై వైద్య, విద్యా, పీఆర్, ఆర్ అండ్ బి,గిరిజన ఇంజినీరింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 35 కోట్ల నిధులతో పనులు చేపట్టినట్లు చెప్పారు. పాఠశాలల అభివృద్ధికి చేపట్టిన పనులు ఎందుకు పూర్తి చేయలేక పోతున్నారని ప్రశ్నించారు.

టెండర్ ప్రక్రియలో కూడా జాప్యం జరుగుతుందని అసంతృప్తి వ్యక్తం చేశారు. నిధులు మంజూరు చేసినప్పటికి ఎందుకు పనులు పూర్తి చేయలేకపోతున్నారని, మీ నిర్లక్ష్యం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. మంజూరు చేసిన నిధులకు సంబంధించి రికార్డులు పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. ఎస్పి.డా వినీత్, వైద్యాధికారి డా శిరీష, ఆర్ అండ్ బి ఈ భీంలా, పీఆర్ ఈ ఈ శ్రీనివాస రావు, మంగ్యా, గిరిజన సంక్షేమ శాఖ ఈ ఈ తనాజీ డీఈఓ వెంకటేశ్వర చారి తదితరులు పాల్గొన్నారు.

Related posts

గెలిచాక ఇళ్ల నిర్మాణానికే మొదటి ప్రాధాన్యం

Satyam NEWS

గౌరమ్మకు అరుదైన గౌరవం బతుకమ్మ

Satyam NEWS

అనుమానం పెనుభూతమై భార్యను హత్య చేసిన భర్త

Satyam NEWS

Leave a Comment