32.2 C
Hyderabad
May 21, 2024 13: 36 PM
Slider ప్రత్యేకం

రెవెన్యూ శాఖలో ఇంకా తిరుగుతూనే ఉన్న ‘‘చంద్ర’’ చక్రం

ap secratariat

చంద్రబాబు ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పిదాలను సమీక్షించి ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టే చర్యలను సవరించటానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న చర్యలకు కొంతమంది అధికారులు గండి కొడుతున్నారు. గత ప్రభుత్వహయాంలో కీలక స్థానాలలో ఉండి అప్పటి అధికార పార్టీకి అండదండలు అందించిన అధికారులు,  ప్రస్తుతం మళ్లీ కీలక స్థానాల్లో చేరి ప్రభుత్వం ఆదేశాలను ధిక్కరిస్తున్నారు. రాష్ట్ర సచివాలయంలోని రెవెన్యూ విభాగంలో చాలా రోజుల నుంచి తిష్ట వేసిన ఒక ప్రత్యేక అధికారి ఈ కోవలో ముందుంటాడు. అతని  హస్త లాఘవం వల్ల కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమి ప్రభుత్వ పరం కాకుండా ఉండిపోతున్నాయి.

చివరికి రాష్ట్ర ఉపముఖ్యమంత్రి (రెవెన్యూ) ఆదేశాలను, ఇటీవల పదవి విరమణ చేసిన రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదేశాలను అమలు చేయకుండా అతను అడ్డం తిరిగాడు. గత ప్రభుత్వంలో లబ్ది పొందిన వారికే ఆ భూమి దక్కేటట్లు చేయటంలో ఈ అధికారి పోషించిన పాత్ర అధికార వర్గాలలో తీవ్ర చర్చనీయాంశం అయింది. కేవలం వారం రోజుల పాటు ఉపముఖ్యమంత్రి ఆదేశాలను తొక్కిపెట్టినందుకు ఈ అధికారికి సుమారు కోటి రూపాయలు రామ ప్రసాదం గా ముట్టినట్లు తెలుస్తోంది.

ఈ కుంభకోణం పూర్వ పరాల లోనికి వెళితే చాలా ఆసక్తికర విషయాలు వెలుగు లోనికి వచ్చాయి. గత ప్రభుత్వం ఎన్నికలు వెళ్లేముందు నిబంధనలు తుంగలోకి తొక్కి కోట్ల రూపాయలు విలువైన భూమిని కేవలం కోటి రూపాయలకు కేటాయించింది. కలియుగ వైకుంఠం గా పిలవబడే తిరుపతి నది ఒడ్డున సుధాబా అనే విద్యాసంస్థకు 2019 మార్చి నెలలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పది ఎకారాలభూమిని కేటాయించింది. ఈ భూమి కేటాయింపులో పూర్తిగా నిబంధనలను పక్కన పెట్టిన అప్పటి ప్రభుత్వం రాష్ట్ర భూమి మేనేజ్మెంట్ అథారిటీ(ఏ పి ఎల్ ఎంఏ) సిఫార్సు చేసిన ధరను పక్కనే పెట్టి కారుచవుక గా భూమిని కేటాయించింది.

అప్పటి అధికారులు ఎకరా 80 లక్షలకు కేటాయించాలని ప్రభుత్వానికి సిఫార్సు చేస్తే అప్పటి మంత్రివర్గం ఎకరాకు 10 లక్షలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి ధర ఎకరాకు కోటి రూపాలు ఉండడటం అతి తక్కువ ధరకే కేటాయిస్తే పెద్దమొత్తంలో సదరు సంస్థ నుంచి లాభం కలుగుతుందని అప్పటి పెద్దలు భావించి అధికారుల నిర్ణయానికి విరుద్ధంగా ధరను నిర్ణయించారు. దీనికితోడు ధరను తగ్గించాలని సదరు సంస్థ కొరక పోయినా మంత్రివర్గం తక్కువ ధరకు భూమి కేటాయించింది అంటే ఎంత మేరకు అవినీతి జరిగిందంటే ఊహించవచ్చుని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

గత ప్రభుత్వం లో తీసుకున్న నిర్ణయాలను పరిశీలించిన ప్రభుత్వం ఈ భూ కేటాయింపుపై పరిశీలన చేసింది. తిరుపతి లోని రెవెన్యూ కార్యాలయాల నిర్మాణాకి సుమారు 41 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. గత ప్రభుత్వం కేటాయించిన ఈ 10 ఎకరాలను కూడా రెవెన్యూ కార్యాలయాలకు కేటాయించాలని డైరెక్టర్ సర్వే విభాగం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. అతి తక్కువ ధరకు నిబంధనలను తుంగలోకి తొక్కి కేటాయిచినందున ఈ ఉత్తర్వులను రద్దు చేయాలని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్ చంద్ర బోస్ ఆదేశించారు.

ఈ ఆదేశాలను వెంటనే అమలు చేయాలని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్మోహన్ సింగ్ గత నెల 30 వతేదీన ఆదేశించారు. ఆయన 31వ తేదీన పదవి విరమణ చేయడంతో ఆ ఫైల్ ను ఈ ప్రత్యేక అధికారి తొక్కి పెట్టి సదరు చవుకగా భూమి దక్కించుకున్నవారిని అప్రమత్తం చేశారు. రద్దు ఉత్తర్వులు రాకముందే ఈ భూమిని సదరు సంస్థకు కొనసాగించాలని రాష్ట్ర మంత్రి ఒకరు ముఖ్యమంత్రి కార్యాలయం ద్వారా రెవెన్యు శాఖ కు సిఫార్సు చేయించారు.

మంత్రి ఉత్తర్వులను తుంగలో తొక్కి ముఖ్యమంత్రి ద్వారా ఒత్తిడి చేయించటంలో రెవెన్యూ శాఖ ఓఎస్డీ కీలకసపాత్ర పోషించినట్లు తెలిసింది. ఈ అధికారికి సచివాలయంతో  సంబంధంలేని వేరే ప్రభుత్వ ఉద్యోగి. గతంలో కీలకమైన భూమి వ్యహారాలను సచివాలయంకు చెందిన ఉపకార్యదర్శి హోదాగల అధికారి పర్యవేక్షించే వారు. గత ప్రభుత్వ పెద్దల అవసరాలను చక్కబెడుతుండటంతో ఈయనకు సహాయకార్యదర్శి నుంచి ఓఎస్డీ గా మార్చి ఈ భూముల వ్యహారాలను అప్పచెప్పేరు. దీనివెనుక అప్పటి చినబాబు సహాకారం లభించటంతో అన్ని తాను అయి వ్యహారాలను నడిపినట్లు తెలిసింది. ఈ ప్రభుత్వంలో కూడా మంత్రి ఉన్నతాధికారి ఆదేశాలను ధిక్కరిస్తున్నారంటే ఈయన పలుకుబడి ఊహించుకోవచ్చు.

Related posts

కళ్లకు గంతలు కట్టుకున్న గాంధారిలా విజయమ్మ

Satyam NEWS

వినుకొండ ఎమ్మెల్యే బొల్లాకు తీరని ఆవేదన

Satyam NEWS

బోటు ఓనరు పై కఠిన చర్యలకు సిఎం ఆదేశం

Satyam NEWS

Leave a Comment