తెలుగుదేశం పార్టీ హయాంలో కట్టిన బిల్డింగులకు రంగులేసుకోవటం తప్ప ప్రస్తుత ప్రభుత్వం ప్రజలకు చేసింది ఏం లేదని గుంటూరు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకుడు మాజీ MLA కొమ్మాలపాటి శ్రీధర్ విమర్శించారు. రాష్ట్రంలో ఒక పక్క భవన నిర్మాణ కార్మికులు చనిపోతున్నా కనీసం పట్టించుకున్న దాఖలాలు కూడా లేవని ఆయన అన్నారు. పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్రృత సమావేశం శ్రీధర్ ఆధ్వర్యంలో పేరేచర్ల లో ఈ రోజు ఘనంగా జరిగింది. ఈ సమావేశంలో శ్రీధర్ మాట్లాడుతూ అనుకున్న దానికంటే కార్యకర్తలు ఎక్కువగా రావటం చాలా సంతోషకరం అని అన్నారు. రానున్న పంచాయతీ ఎన్నికల్లో TDP పార్టీ ఘన విజయం సాధిస్తుందని అంతేకాక మళ్లీ 2024 లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన అన్నారు. కార్యకర్తలను ప్రభుత్వం ఎలాంటి ఇబ్బందులు పెడుతున్నా తాను ఒక అన్న లాగ ఉంటానని కార్యకర్తలకు ఆయన ధైర్యం చెప్పారు.
previous post