25.7 C
Hyderabad
May 22, 2024 08: 19 AM
Slider విశాఖపట్నం

బొబ్బిలి సభతో జగన్‌ భూ రుణం తీర్చుకున్న బొత్స ఫ్యామిలీ..?

#Minister Botsa Satyanarayana

క్విడ్‌ ప్రో కో… ఈ వాక్యం వింటే తెలుగు రాష్ట్రాల్లో ఎవరికైనా ముందుగా గుర్తొచ్చే పేరు వైఎస్‌ జగన్‌. రాజకీయానికి, వ్యాపారానికి మధ్య తేడా లేకుండా చేసిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది. ప్రజా ధనాన్ని, అయిన వారికి అందిన కాడికి దోచిపెట్టడం.. దేవుడిగా జై కొట్టించుకోవడం ఆయనకే చెల్లింది. రాష్ట్ర మంత్రి, సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ కుటుంబానికి భూ కేటాయింపులు, ఈ విషయాన్ని మరోసారి రుజువు చేశాయి. విజయనగరం జిల్లా బొబ్బిలిలో ఎకరా 80 లక్షల విలువైన భూములను కేవలం 10 లక్షలకే బొత్స కంపెనీకి కట్టబెట్టింది జగన్‌ సర్కార్. ఈ అంశంపై ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా.. డోంట్‌ కేర్‌  అన్నట్టు వ్యవహరించింది రాష్ట్ర ప్రభుత్వం.

సీఎం చేసిన మేలుకి ప్రతిగా.. విజయనగరం సభను సూపర్‌ సక్సెస్‌ చేయడం ద్వారా రుణం తీర్చుకున్నారట సత్తిబాబు. విజయనగరంలో గిరిజన‌ యూనివర్శిటీ ప్రారంభోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు వైసీపీ నాయకులు. ఈ సభకు సీఎం జగన్‌తో పాటు కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌, పలువురు రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. ఈ మీటింగ్‌ను సక్సెస్‌ చేయడంలో స్థానిక నాయకుడు బొత్స సత్యనారాయణ కీలకంగా వ్యవహరించారు. అంగ బలం, అర్ధ బలం ఉపయోగించి ఉత్తరాంధ్ర నలమూలల నుంచి వేలమంది ప్రజలను జగన్‌ సభకు తరలించారు. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన ప్రజలను చూసి ముఖ్యమంత్రి‌ కూడా ఫుల్‌ ఖుష్‌ అయ్యారని సమాచారం.

బహిరంగ సభలను బల ప్రదర్శనకు వేదికలుగా మలుకొంటున్నాయి రాజకీయ పార్టీలు. మీటింగ్‌లకు ఎంత ఎక్కువ మంది వస్తే తమకు అంత ప్రజా బలం ఉందని ప్రచారం చేసుకోవడం చూస్తూనే ఉన్నాం. జనం స్వచ్ఛందంగా వస్తే అది ఆ పార్టీ లేదా నాయకుడి ప్రజాకర్షణకు నిదర్శనంగా భావించచ్చే. కానీ ప్రజలను డబ్బు, మద్యం వంటి ప్రలోభాలతో సభలకు రప్పించడం.. లేదా సంక్షేమ పథకాలు రాకుండా చేస్తామని బెదిరించి మీటింగులకు తరలించడం, పార్టీ బలానికి నిదర్శనం కాదు. ఈ వ్యవహారమంతా వాపుని చూపించి బలుపు అని ప్రచారం చేసుకున్నట్టుగా ఉంటుంది.

ఇటు లోకేష్‌ పాదయాత్రకు, బహిరంగ సభలకి జనం భారీగా తరలివస్తున్నారు. యువగళానికి సంఘీభావంగా వేలాది మంది యువత లోకేష్‌ వెంట నడవడానికి, ఆయన వెంట పరుగులు పెడుతున్న విజువల్స్‌ సోషల్‌ మీడియాలో దుమ్మురేపుతున్నాయి. ఇక, టీడీపీ అధినేత  చంద్రబాబు నాయుడు సభలు ఎక్కడ పెట్టినా ఇసుక రాలనంతగా జనం క్యూ కడుతున్నారు. బాబు సభలకు ఇంతటి రెస్పాన్స్‌, పబ్లిక్‌ గేధరింగ్‌ గతంలో ఎన్నడూ కనిపించని పరిస్థితి. ఈ సభలు ప్రజా వ్యతిరేకతకు నిదర్శనం అని, టీడీపీ సభల ప్రజాగ్రహానికి బలి కావడం ఖాయమనే సంకేతాలు ఇంటెలిజెన్స్‌ రిపోర్ట్‌ ద్వారా అందుకున్న తాడేపల్లి ప్యాలెస్‌ నేతలు.. రూట్‌ మార్చారట. జగన్‌ సభలకు భారీగా జనాలని సమీకరించేలా ప్రణాళికలు రచిస్తున్నాయని సమాచారం. ప్రస్తుతం వైసీపీ సభలకు పబ్లిక్‌ రెస్పాన్స్‌ లేదు.

ఈ విషయం వైసీపీ హైకమాండ్‌కి స్పష్టంగా తెలుసు. ఇటు పడిపోతున్న జగన్‌ గ్రాఫ్‌ని, అటు పడి లేచిన కెరటంలా ఉవ్వెత్తున ఎగిసిపడుతున్న టీడీపీ ఇమేజ్‌తో బ్యాలెన్స్‌ చేయడం కోసం సజ్జల టీమ్‌ చేస్తున్న హంగామా తప్ప, ప్రజల నాడి మారిపోయిందనేది వాస్తవం.  తాజాగా బొబ్బిలిలో జరిగిన సభకి వేలాది మందిని సమకూర్చేలా బొత్సకు భారీ ప్యాకేజ్‌ కూడా ఇచ్చారని తెలుస్తోంది.. అదే ఆయన కంపెనీలకు భూమిని ధారాదత్తం చేయడం అని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు.. ఈ పోటీ సభలు, భారీ జన తరలింపు, ఫేక్‌ సర్వేలు పడిపోతున్న వైసీపీ పతనాన్ని ఎంతవరకు కాపాడతాయో చూడాలనే చర్చ నడుస్తోంది.

Related posts

వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది

Satyam NEWS

న‌లుగురు హైకోర్టు న్యాయ‌మూర్తులు 27న రాక‌

Satyam NEWS

ఇల్లీగల్:డబ్బు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్త

Satyam NEWS

Leave a Comment