28.7 C
Hyderabad
May 6, 2024 09: 10 AM
Slider వరంగల్

మౌంట్ ఎల్బర్న్ పర్వతాన్ని అధిరోహించిన ములుగు వాసి

#ilatripathi

ములుగు జిల్లా మంగపేట మండలం వాడాగూడేనికి చెందిన టెక్ మహేంద్ర ఉద్యోగి వాసం వివేక్ కుమార్ యూరోప్ లో అత్యధిక ఎత్తయిన మౌంట్ ఎల్బర్న్ పర్వతాన్ని అధిరోహించారు. రష్యా జార్జియా సరిహద్దుల్లో ఉండే ఈ పర్వతం సముద్ర మట్టానికి సుమారు 5 ,642 మీటర్లు (18 ,510 అడుగులు) ఎత్తులో ఉంటుంది. ఇది ప్రపంచంలోని 10 వ అత్యంత ప్రముఖ శిఖరంగా పేరుగాంచించింది. ఐరోపా, ఆసియ దేశాల్లోనే అత్యధిక ఎత్తులో ఉండే అగ్నిపర్వతం ఈ శిఖరంపై ఉంటుందని చెబుతున్నారు.

పంద్రాగస్టు రోజు (15-8-2023) వివేక్ ఈ  పర్వతాన్ని అధిరోహించి భారత జాతీయ జెండా, తెలంగాణ మ్యాప్ ప్రదర్శించిన వాసం వివేక్ కుమార్ ఈ రోజు ములుగు కలెక్టర్ ఇలా త్రిపాఠి, RDO సత్యపాల్ రెడ్డి, Redcross Society రాష్ట్ర పాలకవర్గ సభ్యులు ఈ.వి.శ్రీనివాస్ రావు, K. ప్రసాద్ రావులను కలిశారు. వారు ఆయనను  శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమం లో Redcross Society జిల్లా సభ్యులు రాజి రెడ్డి, బండి ఈశ్వర్, శ్రమశక్తి అవార్డు గ్రహీత కుసుమ శ్యామసుందర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

‘క్షీర సాగర మథనం’ పాటకు పట్టాభిషేకం!!

Satyam NEWS

మరో సీనియర్ నేత బీఆర్ యస్ కు గుడ్ బై

Satyam NEWS

పేద  ప్రజల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం భరోసా

Satyam NEWS

Leave a Comment