42.2 C
Hyderabad
May 3, 2024 16: 51 PM
Slider నెల్లూరు

సీఎం జగన్ అన్ని హామీలు నెరవేర్చారు: ఎంపీ ఆదాల

#MP Adala

సీఎం జగన్మోహన్ రెడ్డి తాను చెప్పిన అన్ని హామీలను నెరవేర్చారని నెల్లూరు ఎంపీ, రూరల్ నియోజకవర్గ ఇంచార్జ్ ఆదాల ప్రభాకర్ రెడ్డి ప్రశంసించారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలనే కాకుండా దేశంలోనే ఎక్కడా లేని విధంగా సంక్షేమాన్ని విస్తృత స్థాయిలో అమలుపరిచారని కొనియాడారు.

రూరల్ పరిధిలోని 37వ డివిజన్లో కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో, 26వ డివిజన్ లో ఇన్చార్జులు పుల్లూరు చంద్రమౌళి, రొంపిచర్ల సుబ్బారెడ్డి, సన్నపరెడ్డి సుబ్బారెడ్డిల ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో చంద్రబాబు నాయుడు తాను ఇచ్చిన హామీల్లో 20 శాతం కూడా అమలు చేయలేదని విమర్శించారు. అప్పుడు ఏమి చేయని ఆయన, ఇప్పుడు ఏదో చేస్తానని అభూత కల్పనలు సృష్టిస్తున్నారని విస్మయం వ్యక్తం చేశారు. ఆయన ఏం మాట్లాడినా ఇప్పుడు ఎవరూ నమ్మబోరన్నారు.

ఎవరు ఎన్ని చెప్పినా రాబోయేది సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమేనని నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో
మునుపెన్నోడు లేని అద్భుత సౌకర్యాలతో పాటు పేదల ఆరోగ్యం కోసం ఎన్నో ఆసుపత్రులు నిర్మించి డాక్టర్లను నియమించారని తెలిపారు. ఇన్ని సౌకర్యాలు కల్పించిన సీఎం జగన్మోహన్ రెడ్డికి పేదల తరఫున తన కృతజ్ఞతలు తెలిపారు. 37వ డివిజన్లో 80 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, ఇప్పటివరకు 2.80 కోట్ల

రూపాయలతో పనులు చేపట్టామన్నారు. మరో 50 లక్షల రూపాయలు విడుదల చేస్తామని తెలిపారు. 26వ డివిజన్లో 35 లక్షల రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశామని, ఇంకా కోటి రూపాయలు ఇక్కడ అవసరాలకు ఖర్చు పెడతామని తెలిపారు. నెల్లూరు రూరల్లో 150 కోట్ల రూపాయలతో పనులు కొనసాగుతున్నాయని, జిల్లాలో రూరల్ నియోజకవర్గాన్ని నెంబర్ వన్ చేస్తామని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇంత అభివృద్ధి చేస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డిని, తనను ఆశీర్వదించాలని కోరారు.

శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆలయంలో…

శ్రీ రాజేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం అన్నదానాన్ని ప్రారంభించారు. అంతకు ముందు శ్రావణ శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని పూజలు చేశారు. డివిజన్ ఇంచార్జ్ మదన్ మోహన్ రెడ్డి ఆయనను సాదరంగా స్వాగతించారు.

ఈ కార్యక్రమాల్లో విజయ డైరీ చైర్మన్ రంగారెడ్డి, నెల్లూరు రూరల్ పరిశీలకుడు మెట్టుకూరు ధనుంజయ రెడ్డి, బొబ్బల శ్రీనివాస యాదవ్, మూలె విజయభాస్కర్ రెడ్డి, ఒరిస్సా శ్రీనివాసరెడ్డి, నూనె మల్లికార్జున యాదవ్, అవినాష్, సత్తార్, సుధాకర్, వైసీపీ నేతలు స్వర్ణ వెంకయ్య, మైపాడు అల్లా బక్షు,

జడ్పిటిసి మల్లు సుధాకర్ రెడ్డి, వంశి, శ్రీకాంత్ రెడ్డి, పెంచల్ రెడ్డి, రాజేష్,నిజాముద్దీన్, నరసింహారావు, హరిబాబు యాదవ్, టీవీఎస్ కమల్, బాబ్జి, సునీల్ రెడ్డి, సూరిబాబు, పవన్ కుమార్ రెడ్డి, తలారి విఠల్, ఖలీల్, నాయబ్ రసూల్, మేఘనాథ్ సింగ్, పిండి సురేష్, గురవారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Related posts

జిల్లా అభివృద్ధికి నా వంతు సాయం చేస్తా

Satyam NEWS

Over The Counter Monster Testosterone Over The Counter Pills For Erection Male Enhancement Video

Bhavani

ప్రజాస్వామ్య వ్యవస్థలో చురుకుగా పాల్గొంటున్న విద్యార్ధులు

Satyam NEWS

Leave a Comment