24.7 C
Hyderabad
May 16, 2024 23: 41 PM
Slider అనంతపురం

వైకాపా ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారింది

#tdpananthapur

కరువు జిల్లాలో రైతుల పాలిట వైకాపా ప్రభుత్వం శాపంగా మారిందని అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెదేపా నియోజకవర్గ ఇంచార్జ్ మాదినేని ఉమామహేశ్వర నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయదుర్గం- కళ్యాణదుర్గం నియోజకవర్గాల సరిహద్దులో ఉన్న భైరవాని తిప్ప ప్రాజెక్టు నిండిపోవడంతో ప్రాజెక్టుకు తన కార్యకర్తలు నాయకులతో వెళ్ళిన నియోజకవర్గ ఇంచార్జ్ ఉమామహేశ్వర్ నాయుడు గంగపూజ నిర్వహించారు.

నిండిన ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించారు. వందలాది మంది కార్యకర్తల కోలాహలం మధ్య గంగా పూజ నిర్వహించిన అనంతరం ఉమామహేశ్వర నాయుడు మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 1000 కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టుకు కృష్ణా జలాలు తరలించే పథకాన్ని రూపొందించారని, వైకాపా ప్రభుత్వం వచ్చాక ఒక గంపెడు మట్టే కూడా తీయలేదని కేవలం రైతులను మభ్యపెట్టే ప్రకటనలు మాత్రం చేస్తూ కృష్ణా జిల్లాలో తరలించే కార్యక్రమాన్ని మరుగున పడేసి రైతుల పాలిట శాపంగా మారిందన్నారు.

ప్రభుత్వం కరుణించక పోయినా ప్రకృతి కరుణించి ప్రాజెక్టు నిండి పోయిందని దీంతో  ఆయకట్టుకు నీరుఅండఢం తో పాటు భూగర్భ జలాలు గణనీయంగా పెరిగే పరోక్షంగా రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉందని ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు.ఈ పూజ కార్యకమనికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

Related posts

వరి వేయండని చెప్పిన వారు ఇప్పుడు పారిపోయారు

Satyam NEWS

హిందూ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో నిరసన ర్యాలి

Satyam NEWS

తైవాన్ చైనా: మరో యుద్ధం దిశగా ముందడుగు

Satyam NEWS

Leave a Comment