35.2 C
Hyderabad
May 21, 2024 17: 31 PM
Slider ముఖ్యంశాలు

వర్షంలోనే సారిపల్లి లో లబ్ధిదారులకు టిడ్కో ఇండ్ల పంపిణీ

#tidcohouses

ఓవైపు జోరుగా వర్షం.. మరోవైపు తమకు పట్టాలు ఎప్పుడు ఇస్తారా అని లబ్దిదారులు ఎదురు చూపులు. వెరసి… విజయనగరం జిల్లా కేంద్రానికి అనుకుని ఉన్న సారిపల్లి లో అగుపించిన దృశ్యం. సీన్ కట్ చేస్తే..ఆ వర్షం లో తడుస్తూ నే టీడ్కి ఇండ్లను పంపిణీ కార్యక్రమంలో ఆద్యంతం పాల్గొన్నారు… పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ.

గత ప్రభుత్వం అదే టీడీపీ ప్రభుత్వం.. పేదలకు ఇండ్ల పట్టాలను ఇస్తామని.. నెలకు అయిదు వందలు కట్టించుకుందని కానీ ప్రభుత్వం.. కేవలం రూపాయి లబ్ధిదారు నుంచీ వసూలు చేసి..300 చదరపు అడుగులతో ఏకంగా ఇల్లే నిర్మించి ఇస్తోందని మంత్రులు చెప్పారు. వచ్చే జనవరి నాటికి రెండు లక్షల ఇండ్లు నిర్మించి లబ్దిదారులకు అందిస్తామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి సురేష్ చెప్పారు.

తొలుత.. గొడుగులేసుకుంటూ…వర్షంలో తడుస్తూ.. మంత్రులిద్దరూ ఇండ్ల ప్రారంభోత్సవం సందర్భంగా.. శిలాఫలకం ఆవిష్కరించారు. కార్యక్రమానికి విజయనగరం ఎమ్మెల్యే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి అధ్యక్షత వహించగా.. జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, ఎంఎల్సీ లు వీఎంసీ కార్పొరేటర్లు..వైఎస్సార్సీపీ నేతలు రాజేష్, ఆశపు వేణు తో పాటు కలెక్టర్ సూర్య కుమారి..టీడ్కో చైర్మన్ ప్రసన్న కుమార్.. డీఎస్పీ శ్రీనివాసరావు, సీఐ లక్ష్మణరావు, ఎస్ఐలు నసీం ,ట్రాఫిక్ ఎస్ఐ లు భాస్కరరావు, దామోదర రావు లు పాల్గొన్నారు.

Related posts

ఒక్క స్నాప్  తో ఘ‌ట‌నా స్థ‌లికి పోలీసులు….!ఎక్క‌డంటే…?

Satyam NEWS

చేజర్ల మంచినీటి సమస్యకు ఎత్తి పోతల పరిష్కారం

Bhavani

ఆ పిల్లలంతా గోదాదేవిలు..వాళ్ల తోవిష్ణు సహస్రనామ పారాయణం…!

Satyam NEWS

Leave a Comment