Slider విజయనగరం

ఒక్క స్నాప్  తో ఘ‌ట‌నా స్థ‌లికి పోలీసులు….!ఎక్క‌డంటే…?

#vijayanagaram police

సోష‌ల్ మీడియా ఏ ప‌నిని అయినా చేయిస్తుంది. గ‌లాటా తీసుకు రావొచ్చు అధికారుల‌లో క‌దిలిక తెప్పించొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా  జ‌గ‌న్ ప్ర‌భుత్వం మెగా గ్రౌండింగ్ మేళాను మూడు రోజుల పాటు  నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలోనే విజ‌య‌న‌గ‌రం జిల్లా రూర‌ల్ లోని గుంక‌లాం  వ‌ద్ద ఆ మెగా గ్రౌండింగ్ ప‌నులను ద‌గ్గ‌రుండీ హౌసింగ్ కార్పొరేష‌న్ ల‌బ్దిదారుల‌చే ప‌నులు ప్రారంభించేందుకు అదీ స్థానిక ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్రస్వామి ద్వారా  జులై 1 న  శ్రీకారం చుట్టింది.

ఆ కార్య‌క్ర‌మాన్ని క‌వ‌ర్ చేసేందుకు మీడియా వెహికల్ బ‌య‌లు దేర‌డమూ జ‌రిగింది. స‌రిగ్గా గొట్లాం దాటి ఎడ‌మ వైపు తిరిగి వెళ్లే దారిలో అధిక సంఖ్య‌లో ల‌బ్దిదారులు ఆటోల‌లోనూ బైక్ ల‌పై,న‌డుచుకుంటూ వెళుతున్న క్ర‌మంలో జ‌ర్న‌లిస్ట్ ల‌ను తీసుకెళుతున్న మీడియా వాహ‌నం  ఆ ర‌ద్దీ మ‌ధ్య ఇరుక్క‌పోయింది.

దాదాపు గంట‌న్న‌ర వ‌ర‌కు జ‌ర్న‌లిస్టులు వెళుతున్న మీడియా వాహ‌నం బ్రిడ్జి స‌మీపంలో ఇరుక్కుపోయింది. ఓవైపు క‌లెక్ట‌ర్,ఎమ్మెల్యేలు వ‌స్తారు…క‌వ‌ర్ చేయాల‌ని…ఘ‌టాన స్థ‌లి  నుంచీ క‌ద‌ల‌లేని ప‌రిస్థితి.దీంతో  వీడియో షాట్స్ కోసం మీడియా జ‌ర్న‌లిస్టు లంతా వాహ‌నం దిగి..ఓ వైపు ర‌ద్ద‌నీ నియంత్రిస్తునే మ‌రోవైపు ర‌ద్దీ పోటోలు తీసారు.

ఈ క్ర‌మంలోనే ఆర్డీఓ వాహ‌నం కూడా  ఇరుక్కుపోయింది. అయితే  ఓ జ‌ర్న‌లిస్ట్…మీడియా వాహ‌నం ఇరుక్కుపోవ‌డాన్ని చూసి త‌క్ష‌ణం రూర‌ల్ సీఐ కు పోన్ చేసారు. 

ఆ త‌ర్వాత  ఎస్పీకి, డీఎస్పీకి వాట్సాప్ మెసేజ్ పెట్టారు. పావుగంటలో రూర‌ల్ పోలీసులు ఘ‌టాన‌స్థ‌లికి వ‌చ్చి  ర‌ద్దీని క్లియ‌ర్ చేసారు. దీంతో సునాయాశంగా ఘ‌ట‌నా స్థ‌లికి  వాహ‌నంలో వెళుతున్న జ‌ర్న‌లిస్టుల్ మెగా గ్రౌండింగ్ మేళా జ‌రుగుతున్న స్థలికి చేరుకున్నారు.

అయితే  ఘ‌టనా స్థ‌లిలోనే రూల‌ర్ సీఐ మంగ‌వేణి,ఎస్ఐ నారాయ‌ణ‌ల‌ను స‌త్యం న్యూస్.నెట్ ప్ర‌తినిధి ట్రాఫిక్ జామ్ ఎందుకు జ‌రిగింద‌ని ప్ర‌శ్నించారు. దీంతో మాకెవ్వ‌రూ ముందుగా చెప్ప‌లేదని  తెలిపారు.

ముందు రోజే గుంక‌లాం వద్ద ఓ చిన్న‌ కార్య‌క్ర‌మం ఉంద‌ని స‌మాచార‌మే త‌ప్ప ఇంకేమీ రాలేద‌న్నారు..ఇంత పెద్ద ఎత్తున ల‌బ్దిదారుల గ్రౌండింగ్ మేళా  ఉంద‌ని త‌మ‌కు తెలియ‌ద‌న్నారు. ఆర్డీఓ , ఎమ్మెల్యే పీఏల ద్వారా  తెలిసింద‌ని… అప్ప‌టికే ఎస్పీ మాకు అక్షింత‌లు వేసార‌ని సీఐ తెలిపారు.

గ‌తేడాది సీఎం జ‌గ‌న్ కార్య‌క్ర‌మానికి ముందుగా చెప్ప‌డంతో  ప‌క‌డ్బందీగా పోలీసుల బందోబ‌స్తు జ‌రిగింద‌ని ప్ర‌స్తుతం సీఎం జ‌గ‌న్ రాక‌పోయినా..వ‌చ్చేలా కార్య‌క్ర‌మం ఏర్పాటు చేసార‌ని ముంద‌స్తు స‌మాచారం లేనిదే ర‌ద్దీని క్ర‌మ‌బ‌ద్దీక‌రించ‌లేమ‌ని ఎస్ఐ నారాయ‌ణ తెలిపారు.

Related posts

అగ్ని ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

జడ్పీ మీటింగ్.. 5 నిమిషాలు: 2024-25 బడ్జెట్ ఆమోదం

Satyam NEWS

చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలని సైకిల్ యాత్ర

Satyam NEWS

Leave a Comment