38.2 C
Hyderabad
May 2, 2024 21: 35 PM
Slider నల్గొండ

చర్చలు సఫలం కార్మికుల సమ్మె విరమణ: సిఐటియు

#cituc

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మేళ్ళచెరువు మండలం రామాపురం ప్రియా సిమెంట్ కర్మాగారంలో గడిచిన ఎనిమిది రోజులుగా కార్మికులు చేపట్టిన సమ్మె విరమిస్తున్నట్లు,ఇది కార్మికుల ఐక్య పోరాట విజయమని సి ఐ టి యు రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు శీతల రోషపతి తెలిపారు.

రామాపురంలో గత ఎనిమిది రోజుల నుండి జరుగుతున్న సమ్మె గురువారం తో ముగించినట్లు ప్రియా సిమెంట్ యాజమాన్యం,కంటాక్టర్స్,సి ఐ టి యు ప్రతినిధులు సుదీర్గ చర్చల అనంతరం లేబర్ యాక్ట్ ప్రకారం క్యాటగిరి మార్చుటకు లేబర్ ఆక్ట్ ప్రకారం వేతనాలు, బోనస్,గ్రాడ్యుటీ ఇతర అలవెన్సులు జూలై నెల నుండి ఇచ్చుటకు అంగీకరించారని, దీంతో ఎనిమిది రోజులుగా చేస్తున్న సమ్మె విరమించినట్లు కార్మిక ప్రతినిధులు తెలిపినారు.

ఈ కార్యక్రమంలో ప్రియా సిమెంట్ యాజమాన్యం తరపున డి జి ఎం సిహెచ్ వెంకటేశ్వరరావు, మెళ్ళచెరువు ఎస్ఐ నరేష్,ఎఎస్సై ఆనంద్,సిఐటియు నాయకులు, గ్రామ పెద్దల సహకారంతో ఒప్పందం జరిగినట్లు తెలిపినారు.చర్చల్లో  కాంట్రాక్టర్స్ కమలపాండే రాఘవరావు,అన్సారీ,గిరి, నాగేశ్వరావు,కృష్ణారెడ్డి,సి ఐ టి యు ప్రతినిధులు శీతల రోషపతి,తీగల శ్రీను, వి.నాగేశ్వరరావు,హరికృష్ణ,నాగేశ్వరరావు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్  హుజూర్ నగర్

Related posts

ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన హైకోర్టు

Satyam NEWS

“ఆహా”లో సూపర్ అనిపిస్తున్న టి.మహీపాల్ రెడ్డి “పోస్టర్”

Satyam NEWS

నందిత శ్వేత IPC 376 ట్రైలర్ కు మంచి రెస్పాన్స్

Satyam NEWS

Leave a Comment