26.7 C
Hyderabad
May 21, 2024 09: 59 AM
Slider ముఖ్యంశాలు

27న కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పర్యటన

#Minister Amit Shah

కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈనెల 27న తెలంగాణలో పర్యటిస్తారని కేంద్రమంత్రి, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. దిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడ చేరుకుని అక్కడి నుంచి హెలికాప్టర్‌లో భద్రాచలం వస్తారని తెలిపారు. భద్రాచలంలో శ్రీరామచంద్రుని దర్శించుకుంటారు.

అనంతరం మధ్యాహ్నం 2గంటలకు భాజపా ఆధ్వర్యంలో ఖమ్మంలో నిర్వహించే ‘రైతు గోస.. భాజపా భరోసా’ బహిరంగ సభలో అమిత్ షా పాల్గొంటారని వెల్లడించారు.ధాన్యం కొనుగోలులో కేసీఆర్‌ ప్రభుత్వం విఫలమైందని కిషన్‌రెడ్డి విమర్శించారు. సమగ్రమైన పంటల బీమా పథకం తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. రైతులకు ఉచిత ఎరువులు ఇస్తామని చెప్పి భారాస ప్రభుత్వం వెన్నుపోటు పొడిచిందన్నారు.

ఎన్నికల ముందు ఓటు బ్యాంకు రాజకీయాల కోసం రుణమాఫీ పేరుతో మరోసారి మోసం చేస్తున్నారని విమర్శించారు. వ్యవసాయ పనిముట్ల సబ్సిడీలను కేసీఆర్‌ సర్కారు ఇవ్వడం లేదన్నారు. సకల సమస్యలకు రైతు బంధు పరిష్కారం కాదన్నారు. లక్షలాది కౌలు రైతులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు.

మహిళా రిజర్వేషన్లపై మాట్లాడే నైతిక హక్కు కేసీఆర్‌ కుటుంబానికి లేదన్నారు. తొలి మంత్రివర్గంలో మహిళా మంత్రి లేకుండా ఐదేళ్లు పాలించిన కేసీఆర్‌కు కేంద్రాన్ని విమర్శించే అర్హత లేదన్నారు..

Related posts

కాకినాడలో పోలీసు అమర వీరులకు ఘన నివాళులు

Satyam NEWS

హిందువుగా జీవించు

Satyam NEWS

అటు రైతుకు ఇటు పేదవాడికి సాయం చేసిన కిషన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment