29.7 C
Hyderabad
May 3, 2024 05: 52 AM
Slider ముఖ్యంశాలు

గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఎన్నికను రద్దు చేసిన హైకోర్టు

#MLA Krishnamohan Reddy'

శాసనసభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు షాక్ తగిలింది. వరుసగా ఎమ్మెల్యేల ఎన్నిక అఫిడవిట్ చెల్లదంటూ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు విషయం మరువకు ముందే.. తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి ఎన్నికను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. దీంతో రెండో స్థానంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణ ను ఎమ్మెల్యేగా హైకోర్టు ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారంటూ ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి అంశంలో ఈ తీర్పును వెలువరించింది.

2018 అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ తరఫున గద్వాల నుంచి బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పోటీ చేశారు. కాంగ్రెస్ నుంచి డీకే అరుణ పోటీ చేశారు. డీకే అరుణపై కృష్ణమోహన్ రెడ్డి 28 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే ఈ ఎన్నికలో ఎమ్మెల్యే అభ్యర్థిగా తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని గెలుపొందిన అభ్యర్థిపై డీకే అరుణ హైకోర్టులో పిటిషన్ వేశారు.

హైకోర్టులో ఎన్నిక వివాదంపై విచారణ జరుగుతుండగానే ఆమె బీజేపీలో చేరిపోయారు. ఇప్పుడు హైకోర్టు ఆమెకు అనుకూలంగా ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఎన్నిక చెల్లదంటూ తీర్పును ఇచ్చింది. ఆ తీర్పును అమలు చేస్తే డీకే అరుణ కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. ఇప్పుడు ఎమ్మెల్యేల పదవి కాలం దాదాపు ముగిసిపోయిన అధ్యయనంలాగే ఉంది.

Related posts

రేవంత్ రెడ్డి ఓ బచ్చా: హోంమంత్రి మహమూద్ అలీ

Satyam NEWS

విద్యతోనే ఉన్నత లక్ష్యాలు చేరుకోవచ్చు

Bhavani

కేంద్ర రైల్వే మంత్రితో ఎంపీ రవిచంద్ర భేటీ

Bhavani

Leave a Comment