26.7 C
Hyderabad
May 21, 2024 09: 54 AM
Slider గుంటూరు

పల్నాడు జిల్లా ఏర్పాటు పనులపై ఎంఎల్ ఏ డాక్టర్ గోపిరెడ్డి సమీక్ష

పల్నాడు జిల్లా కేంద్రంగా ఏప్రిల్ 4 నుంచి నరసరావుపేట నుంచి పరిపాలన ప్రారంభం కానున్న తరుణంలో శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి లింగంగుంట్ల ఎన్ఎస్పీ కాలనీలో తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న జిల్లా కలెక్టర్ కార్యాలయం, ఎస్పీ కార్యాలయాలను పరిశీలించారు. 4వ తేదీ సీఎం వర్చువల్ గా కార్యాలయాలను ప్రారంభించనున్న తరుణంలో పనుల పురోగతిపై ఆరా తీశారు.


3వ తారీకు ఉదయానికి పనులు అన్నీ పూర్తి చేసుకొని.. 4వ తేదీన జరిగే కార్యక్రమాల గురించి మున్సిపల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. 1500 మంది ప్రజానీకం కార్యక్రమాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పల్నాడు ప్రాంత చరిత్రను తెలిపే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు. అనంతరం ఏప్రిల్ 6న ముఖ్యమంత్రి నరసరావుపేట పర్యటన నేపథ్యంలో జరుగుతున్న ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డి.ఎస్.పి విజయ భాస్కర్ రావు, ఆర్ డి ఓ శేషి రెడ్డి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఎం ఎస్ సుధాకర్, సత్యం న్యూస్, నరసరావుపేట

Related posts

ఇక భౌతిక దూరం పాటిస్తూ బతకాల్సిందే

Satyam NEWS

ప్రభుత్వం రియల్ ఎస్టెట్ వ్యాపారం చేయడం సిగ్గుచేటు

Satyam NEWS

27 న దేశ వ్యాప్త బంద్ జ‌య‌ప్ర‌దం చేయాలని కోరుతూ సీపీఎం ర్యాలీ

Satyam NEWS

Leave a Comment